సుప్రీంలో క్యురేటివ్‌ పిటిషన్‌..నిర్భయ దోషి

ఉరిశిక్ష పడిన దోషులకు న్యాయపరంగా ఇది చివరి అవకాశం

Nirbhaya-case-convict-Vinay-Kumar
Nirbhaya-case-convict-Vinay-Kumar

న్యూఢిల్లీ: నిర్భయ దోషులు నలుగురికీ ఉరిశిక్ష వేయాలని ఢిల్లీలోని పటియాల కోర్టు డెత్ వారెంటు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే డెత్ వారెంట్ జారీ అయినప్పటికీ నిర్భయ కేసు దోషుల్లో ఒకడైన వినయ్ శర్మ ఈరోజు సుప్రీం కోర్టులో క్యురేటివ్ పిటిషన్ దాఖలు చేశారు. మరోసారి తన కేసు పరిశీలించాలన్న విజ్ఞప్తి ఇది. ఉరిశిక్ష పడిన వారికి న్యాయపరంగా ఉన్న చివరి అవకాశం. దీనిపై న్యాయమూర్తులు తమ చాంబర్ లోనే విచారణ జరుపుతారు. కాగా కోర్టు ఆదేశాల మేరకు తీహార్ జైల్లో దోషులకు ఈ నెల 22వ తేదీ ఉదయం 7 గంటలకు ఉరిశిక్ష అమలు చేయాల్సి ఉంది. అయితే న్యాయపరంగా తనకు ఉన్న చివరి అవకాశాన్ని వినయ్ శర్మ వినియోగించుకుంటున్నాడు. అలాగే, ఉరి శిక్ష అమలయ్యేలోగా రాష్ట్రపతి క్షమాభిక్ష కోరే అవకాశం కూడా కోర్టు ఇవ్వడంతో అందుకోసం దోషుల తరపు న్యాయవాదులు ముందుకు వెళ్లే అవకాశం ఉంది.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/