దుబ్బాక..21 వ రౌండ్‌లో బిజెపి ఆధిక్యం

20 వ రౌండులో 551 ఓట్ల ఆధిక్యతను సాధించిన బిజెపి

bjp
bjp

సిద్దిపేట: దుబ్బాక ఉపఎన్నిక ఫలితం ఉత్కంఠను రేపుతున్నాయి. 19వ రౌండు ముగిసే సరికి బిజెపిపై టిఆర్‌ఎస్‌ ఆధిక్యతను సాధించగా..20, 21వ రౌండ్లలో బిజెపి మళ్లీ ముందుకు వచ్చింది. 20వ రౌండులో బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు 551 ఓట్ల ఆధిక్యంతను సాధించారు. ఈ రౌండులో బిజెపికి 2,931 ఓట్లు రాగా, టిఆర్ఎస్ కు 2,440 ఓట్లు పడ్డాయి. మరోవైపు 21వ రౌండులో కూడా బిజెపి ఆధిక్యతను ప్రదర్శించింది. ఈ రౌండులో బిజెపి 380 ఓట్ల లీడింగ్ సాధించింది. తద్వారా 21వ రౌండు ముగిసే సరిగి బిజెపి మొత్మంమీద బిజెపి 620 ఓట్ల మెజార్టీతో నిలిచింది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/