దుబ్బాకలో బిజెపి ఘనవిజయం

1,470 ఓట్లతో ఉత్కంఠభరిత విజయం సాధించిన రఘునందన్ రావు

bjp-wins-dubbaka-bypolls

సిద్దిపేట: దుబ్బాక ఉప ఎన్నికలో బిజెపి జయకేతనం ఎగురువేసింది. బిజెపి అభ్యర్థి రఘునందన్ రావు దుబ్బాకలో చరిత్ర సృష్టించారు. ఎంతో ఉత్కంఠను రేకెత్తించిన కౌంటింగ్ లో చివరి మూడు రౌండ్లలో బిజెపి ఆధిక్యత సాధించడంతో… బిజెపి చివరకు విజయనాదం చేసింది. 1,470 ఓట్ల మెజార్టీతో రఘునందన్ రావు గెలుపొందారు. గతంలో దుబ్బాక నుంచి రెండు సార్లు పోటీ చేసిన రఘునందన్ రావు.. మూడో ప్రయత్నంలో ఘన విజయం అందుకున్నారు. బిజెపి గెలుపుతో హైదరాబాదులోని ప్రధాన కార్యాలయం వద్ద పండుగ వాతావరణం నెలకొంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/