కేసీఆర్ ఫ్యామిలీని “RRRR” నిద్ర పట్టనివ్వరు – కిషన్ రెడ్డి

కేసీఆర్ ఫ్యామిలీ ని నిద్ర పట్టకుండా చేయడానికి మాకున్న నాలుగు ఆర్ లు చాలు (రాజా సింగ్, రఘునందన్ రావు, రాజేందర్, రాజ్ గోపాల్ రెడ్డి) అంటూ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసారు. బిజెపి..టిఆర్ఎస్ ఎమ్మెల్యే లను కొనుగోలు చేసేందుకు ట్రై చేసిందనే వార్తలను కిషన్ రెడ్డి ఖండించారు. ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎమ్మెల్యేల కొనుగోలు అంశం సంచలనంగా మారింది. దీనిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మీడియా తో మాట్లాడారు.

కొత్త ప్రభుత్వం లొసుగులపై దర్యాప్తు చేస్తుందనే భయం కేసీఆర్‌ను వెంటాడుతోందని కిషన్ రెడ్డి అన్నారు. సీఎం పదవీ పోతుందని కల్వకుంట్ల ఫ్యామిలీకి భయం పట్టుకుందని మండిపడ్డారు. ఈ వ్యవహారంలో ఫస్ట్ కేసు కేసీఆర్‌పై పెట్టాలని సూచించారు. దొరికిన డబ్బులు ఏమయ్యాయని అడిగారు. ఘటనపై సీబీఐ విచారణ కోరుతున్నామని తెలిపారు. లేదంటే సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని కోరారు. అప్పుడే నిజ నిజాలు వెలుగులోకి వస్తాయని వివరించారు. మునుగోడు లో ఊరికో ఎమ్మెల్యేను పెట్టినా … మీకు ఓట్లు వేస్తారని నమ్మకం మీకు లేదంటూ ఎద్దేవా చేశారు. నాకు నందకుమార్‌ కు ఎలాంటి సంబంధం లేదని… అతడు టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన వాడేనంటూ కిషన్ రెడ్డి అన్నారు. ఆ నలుగురు టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు ప్రజా బలం అస్సలు లేదని.. వారిని మేమేందుకు కొంటామని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు టిఆర్ఎస్ చేసిన పెద్ద కుట్ర అని.. ఓటమి కళ్ళ ముందు కన్పించడం తో కొత్త ఆటకు తెర లేపారని ఆగ్రహించారు.

ఫామ్ హౌస్‌కు పోలీసులు వెళ్లకముందే.. టీఆర్ఎస్ సోషల్ మీడియాలో పోస్టులు సిద్దం అయ్యాయని తెలిపారు. నలుగురు ఎమ్మెల్యేలతో ప్రభుత్వం కూలిపోతుందా అని అడిగారు. తమకు ఇప్పుడేం తొందర లేదని.. 2023 వరకు ఆగుతామని చెప్పారు. కొందరు పోలీసులు దిగజారి ప్రవర్తిస్తున్నారని కిషన్ రెడ్డి ఫైరయ్యారు. రాజీనామా చేయించకుండా ఇతర పార్టీ నేతలను ఆహ్వానించారని.. కొందరికీ మంత్రి పదవులు కూడా దక్కాయని తెలిపారు. తమను బ్రోకరిజం అంటోన్న ఇంద్రకరణ్ రెడ్డి ఏ పార్టీ నుంచి పోటీ చేశారని అడిగారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన 12 మంది ఎమ్మెల్యేలను ఏ ప్రాతిపదికన చేర్చుకున్నారు.. ఎంతమ మందికి పదవులు ఇచ్చారని అడిగారు.