డిసెంబరు 1 నుండి విదేశాల నుండి ఇండియా కు వచ్చే వారికీ కొత్త రూల్స్..

ఓమిక్రాన్ వేరియంట్ కారణంగా విదేశాల నుండి ఇండియా కు వచ్చే వారికీ కేంద్ర ఆరోగ్య శాఖ నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. విదేశాల నుంచి ఇండియాకి వచ్చే వారు తమ ప్రయాణ తేదికి కంటే ముందు 14 రోజుల ట్రావెల్ హిస్టరీని ఎయిర్ సువిధా పోర్టల్‌లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దీంతో పాటు ప్రయాణ తేదికి 72 గంటల ముందు చేయించిన ఆర్టీ పీసీఆర్ నెగటివ్ రిపోర్టును స్వచ్చంధంగా సమర్పించాల్సి ఉంటుంది. అంతేకాదు అవసరమైతే ప్రభుత్వం నిర్ధేశించినట్టుగా క్వారంటైన్లో ఉంటామని సెల్ఫ్ డిక్లరేషన్ సమర్పించాలని తెలిపింది.
ఒమేక్రాన్ వేరియంట్ ప్రభావం ఎక్కువగా ఉందని భావిస్తున్న యూకే, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, బంగ్లాదేశ్, బోత్స్వానా, చైనా, మారిషస్, న్యూజీల్యాండ్, సింగపూర్, జింబాబ్వే, హాంగ్‌కాంగ్, ఇజ్రాయిల్ దేశాలు కేంద్రం ప్రకటించిన అట్ రిస్క్ జాబితాలో ఉన్నాయి. ఈ దేశాల నుంచి వచ్చే వారు ఎయిర్‌పోర్టులు కోవిడ్ టెస్ట్ చేయించుకోవడంతో పాటు 14 రోజుల క్వారెంటైన్ తప్పనిసరి అని సూచించింది. ఎయిర్‌పోర్టులో జరిపే సెల్ఫ్ పెయిడ్ టెస్టులో పాజిటివ్‌గా తేలిన వ్యక్తులను ఇన్స్టిట్యూషనల్ క్వారెంటైన్ సెంటర్‌కి తరలించి వైద్య సాయం అందిస్తారు. పాజిటివ్‌గా తేలిన వ్యక్తులతో పాటు వాటి కాంటాక్టులుగా తేలిన అందిరినీ హోం క్వారెంటైన్ చేస్తారు.