బుల్లితెర ఫై కూడా హావ చూపించిన బింబిసార

Kalyan Ram look in Bimbisara movie
bimbisara

కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బింబిసార ఓ మైలు రాయి చిత్రంగా నిలిచిపోయిన సంగతి తెలిసిందే. సోషియో ఫాంటసీ చిత్రంగా.. టైం ట్రావెల్ కాన్సెప్టుతో మల్లిడి వశిష్ట డైరెక్ట్ చేసిన ఈ మూవీ ఎన్నో అంచనాలతో విడుదలైంది. ఆ అంచనాలకు తగ్గట్లే ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ దక్కింది. దీంతో ఈ మూవీకి తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన అన్ని ఏరియాల్లోనూ మంచి స్పందన దక్కింది. అలాగే బాక్స్ ఆఫీస్ వద్ద దాదాపు రూ. 40 కోట్లు కలెక్ట్ చేసి కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. కేవలం వెండితెరపై మాత్రమే కాదు బుల్లితెర ఫై కూడా బింబిసార భారీ టిఆర్పి రేటింగ్ సాధించింది.

ఇటీవలే జీ తెలుగు ఛానెల్‌లో వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌గా ప్రసారం అయింది. థియేటర్స్ లలో హిట్ అవ్వడంతో బుల్లితెర ఫై చూసేందుకు సైతం ప్రేక్షకులు పోటీ పడ్డారు. దీంతో అర్బన్ ఏరియాలో 11.46 రేటింగ్ , అర్బన్ ప్లస్ రూరల్ ఏరియాలకు సంబంధించి ఏకంగా 9.45 టీఆర్పీ రేటింగ్ సాధించింది. తద్వారా కల్యాణ్ రామ్ కెరీర్‌లోనే అత్యధిక టీఆర్పీ రేటింగ్ రాబట్టిన చిత్రంగా ‘బింబిసార’ రికార్డును క్రియేట్ చేసింది. అలాగే, ఈ మధ్య కాలంలో మంచి రేటింగ్ సాధించిన సినిమాగానూ నిలిచింది.

ఈ సోషియో ఫాంటసీ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్ బ్యానర్‌పై హరికృష్ణ భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో కేథరిన్ థ్రెస్సా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటించగా.. వెన్నెల కిశోర్, శ్రీనివాసరెడ్డి, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు చేశారు. ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందించారు.