వరంగల్‌ జిల్లాలో మంత్రి హరీష్ రావు పర్యటన

TS Minister Harish Rao
TS Minister Harish Rao

వరంగల్‌ జిల్లాలో ఈరోజు , రేపు మంత్రి హరీష్ రావు పర్యటించబోతున్నారు. పలు సమీక్షలు , శంకుస్థాపనలు , ప్రారభోత్సవాలు చేయనున్నారు. సోమవారం ఉదయం 10:30 గంటలకు భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా ఆసుపత్రి ప్రారంభంతోపాటు, మరో 50 పడకల ఆయూష్‌ ఆసుపత్రి నిర్మాణం, డయాగ్నోస్టిక్‌ హబ్‌, 20 పడకల న్యూబర్న్‌ కేర్‌ యూనిట్‌కు శంకుస్థాపన చేయనున్నారు. మధ్యాహ్నం 12గంటలకు కేటీపీపీ జెన్‌కో సమావేశ మందిరంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహిస్తారు. సాయంత్రం 4.15 గంటలకు హనుమకొండ కలెక్టర్‌ కార్యాలయంలో ఎంజీఎం, కేఎంసీ సూపర్‌స్పెషాలిటీ, సీకేఎం, జీఎంహెచ్‌, టీబీ ఆసుపత్రుల సూపరింటెండెంట్లు, వైద్యవిభాగాధిపతులు, ఆర్‌ఎంవోలతో సమీక్షా సమావేశం చేయనున్నారు. రాత్రికి రాంనగర్‌లోని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు నివాసంలో బస చేయనున్నారు.

మంగళవారం ఉదయం మహబూబాబాద్‌ జిల్లా కేంద్రానికి వెళతారు. ఉదయం 10.30 గంటలకు జిల్లా ఆసుపత్రి నిర్మాణానికి, ఏరియా ఆసుపత్రిలో రేడియాలజీ ల్యాబ్‌ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఆసుపత్రిలోని 41 పడకల జనరల్‌ వార్డు, పిల్లల ఐసీయూ వార్డు, అదనపు అంతస్తు భవన సముదాయం, పడకలను ప్రారంభిస్తారు. నిర్మాణంలో ఉన్న నర్సింగ్‌ కళాశాలను సందర్శించి పనుల పురోగతిని పరిశీలిస్తారు. 11 గంటలకు అధికారులతో సమీక్షా సమావేశం. సాయంత్రం 6 గంటలకు హనుమకొండలోని ఎస్వీఎస్‌ గ్రూప్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి 7 గంటలకు రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు తిరుగుప్రయాణం చేయనున్నారు.