ప్రధాని మోడిని ఆహ్వానించిన కేజ్రీవాల్‌

రేపు ప్రమాణస్వీకారం చేయనున్న కేజ్రీవాల్

kejriwal-pm modi
kejriwal-pm modi

న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ సిఎంగా కేజ్రీవాల్ ఆదివారం నాడు మూడోసారి ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి విచ్చేయాల్సిందిగా ప్రధాని మోడిని కేజ్రీవాల్ కోరారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిని కానీ, ఇతర రాష్ట్రాల నేతలను కానీ తమ ప్రమాణస్వీకారానికి ఆహ్వానించడం లేదని నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, మోడికి కేజ్రీవాల్ ఆహ్వానం పలకడం విశేషం. మరి కేజ్రీవాల్ ఆహ్వానం మేరకు ప్రమాణస్వీకారం కార్యక్రమానికి మోడి వస్తారా? లేదా? అనే విషయం ఆసక్తికరంగా మారింది. ఢిల్లీలోని రాంలీలా మైదాన్ లో 51 ఏళ్ల కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/