యాసంగిలో వ‌రి వేసుకోవచ్చని చెప్పి చిన్న మెలిక పెట్టిన కేసీఆర్

యాసంగిలో వ‌రి వేసుకోవచ్చని చెప్పి చిన్న మెలిక పెట్టిన కేసీఆర్

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో వరి కొనుగోలు చర్చ వాడి వేడిగా నడుస్తున్న సంగతి తెలిసిందే. కేసీఆర్ సర్కార్ యాసంగి ధాన్యం ఫై కేంద్రం తో పోరాటం చేస్తుంది. తాజాగా కేంద్ర యాసంగి ధాన్యం కొనుగోలు చేయమని క్లారిటీ ఇచ్చింది. దీంతో యాసంగి లో వరి వేయకూడదని తెలంగాణ మంత్రి సూచించారు.

ఇదిలా ఉంటె తాజాగా తెలంగాణ మంత్రి కేసీఆర్ యాసంగిలో వ‌రి వేసుకోవచ్చని చెప్పి చిన్న మెలిక పెట్టాడు. యాసంగి లో రైతులు వ‌రి వేసుకోవ‌చ్చు అని చెప్పి చిన్న మెలిక పెట్టాడు. రైతులు ఎవ‌రైనా.. వ‌రి వెస్తే దానికి ప్ర‌భుత్వం ఎలాంటి హామీ ఇవ్వ‌ద‌ని తెలిపాడు. అలాగే ప్ర‌భుత్వం ధాన్యం కొనుగోలు కూడా చెయ‌ద‌ని స్ప‌ష్టం చేశారు. రైతులు సొంత రిస్క్ తోనే వ‌రి పంట వేసుకోవాల‌ని తెలిపారు. ఆహారం కోసం గానీ లోకల్ వ్యాపారు ల‌తో కాని ఒప్పందం చేసుకుని వ‌రి పంట వేసుకోవ‌చ్చ‌ని రైతులకు సూచించారు.

దీనికి రాష్ట్ర ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి గ్యారంటీ ఇవ్వ‌దు అని అన్నారు. కానీ రైతు బందు త‌ప్ప‌కకుండా ఇస్తామ‌ని హామీ ఇచ్చారు. అలాగే 24 గంట‌ల క‌రెంటు ను కూడా ఇస్తామ‌ని తెలిపారు.