తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 ప్రోమో వచ్చేసింది

బిగ్ బాస్ సీజన్ 07 ప్రోమో వచ్చేసింది. నార్త్ లో సూపర్ సక్సెస్ అయినా బిగ్ బాస్ రియాల్టీ షో..సౌత్ లోనే అంతే ఆదరణ దక్కించుకుంటూ వస్తుంది. ఇప్పటీకే ఆరు సీజన్లు సక్సెస్ ఫుల్ గా పూర్తి చేసుకోగా , ఏడో సీజన్ ఈ నెల చివరి వారం లో కానీ ఆగస్టు మొదటి వారం లో కానీ మొదలుకాబోతుంది. ఈ తరుణంలో బిగ్ బాస్ యాజమాన్యం సీజన్ 07 కు సంబదించిన ప్రోమో ను విడుదల చేసి ఆసక్తి పెంచారు. ఈ ప్రోమోలో ఎలాంటి డిటైల్స్ అయితే ఇవ్వలేదు. కేవలం లోగో చూపించారు. ఇక ఈ సీజన్ కోసం… ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక కూడా అయిందట. ఫైనల్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేశారని సమాచారం. అయితే నాలుగు సీజన్స్ కు నాగార్జున హోస్ట్ గా బాధ్యత తీసుకున్నాడు. అయితే ఈ సారి నాగార్జున ప్లేస్ లో బాలకృష్ణ ను హోస్ట్ గా తీసుకున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి.

సీజన్ 6 విషయంలో నాగార్జున విమర్శల పాలయ్యారు. నాగార్జున పూర్తి స్థాయిలో మెప్పించలేదని.. ప్రేక్షకులు అభిప్రాయపడ్డారు. ఆ మధ్య ట్రోల్స్, మీమ్స్ కూడా వచ్చాయి. మొత్తంగా కూడా సీజన్ 6 అట్టర్ ప్లాప్ కాగా.. కనీస టీఆర్పీ రాలేదు. అందుకే నాగార్జున బిగ్ బాస్ కు గుడ్ బై చెప్పారని తెలుస్తోంది. అన్ స్టాపబుల్ షో తో మంచి పేరు సంపాదించుకున్న బాలయ్య బాబు. ఆ షో చేయక ముందు బాలయ్యపై అభిప్రాయం వేరే ఉండేది. ఇక ఆ షో తర్వాత బాలయ్య అంటే.. బోళా శంకరుడు అన్నట్లు మారిపోయింది. అందుకే బాలకృష్ణ ను ఈసారి బిగ్ బాస్ హోస్ట్ గా ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. మరి నిజంగా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరిస్తున్నారా లేదా అనేది అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

YouTube video