మానస్ నుండి అదే కోరుకుంటున్న అంటూ బిగ్ బాస్ వేదిక గా కోరిక చెప్పి గుడ్ బై చెప్పిన ప్రియాంక సింగ్

బిగ్ బాస్ సీజన్ 5 తెలుగు ఎండ్ కార్డు కు వచ్చేసింది. మరో రెండు వారాల్లో సీజన్ పూర్తి అవుతుంది. దీంతో టైటిల్ విన్నర్ ఎవరు అవుతారో అనే ఆసక్తి ప్రేక్షకుల్లో రెట్టింపు అవుతుంది. ఇప్పటికే గ్రాండ్ ఫినల్ కి శ్రీరామ్ చంద్ర వెళ్లారు. ఇక మిగతా ఉన్న సభ్యుల్లో ఎవరు ఫైనల్ కు చేరుతారో చూడాలి. ఇక ఈరోజు పదమూడో కంటెస్టెంట్ గా ప్రియాంక సింగ్ ఎలిమినేట్ అయింది. అయితే ఈవారం ప్రియాంక ఎలిమినేట్ అవుతుందని రెండు రోజులకు ముందే తెలిసిపోవడం తో పెద్దగా ఆసక్తి కనిపించలేదు. కాకపోతే స్టేజ్ ఫై ఏమాట్లాడుతుందో..మానస్ గురించి ఏంచెపుతుందో అనే ఆసక్తి ఉంది.

బిగ్ బాస్ నుండి బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన ప్రియాంక ను గ్రాండ్ గా వెల్ కం చెప్పి ఆమె జర్నీ చూపించాడు నాగ్. ఆమె జర్నీ చూసి ఎంతో ఎమోషనల్ అయ్యింది. ఆ తర్వాత ఇంట్లోకి వచ్చినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగింది.. వెళ్తున్నప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉందో చెప్పాలంటూ నాగ్ ప్రియాంక కు టాస్క్ పెట్టాడు. దీంతో ఆమె అందరి గురించి చెప్పుకొచ్చింది. ఇలా లాస్ట్ లో మానస్ గురించి చెపుతూ ఎమోషనల్ అయ్యింది.

మానస్‌ను మొదటిసారి చూసినప్పుడు.. ఎవరబ్బా ఈ సిల్కీ హెయిర్ అనుకున్నాను.. ఫస్ట్ టైం మాట్లాడాను. కానీ నన్ను చూసి మాట్లాడలేదు.. ఇంత పొగరేంట్రా? అనుకున్నాను.. ఇక ఎప్పుడూ మాట్లాడొద్దని అనుకున్నాను. కానీ మెల్లిమెల్లిగా క్లోజ్ అయ్యాం. మవిన్నర్‌గా చూడాలని అనుకుంటున్నాను.. నీ ఫ్రెండ్ షిప్ ఎప్పటికీ కావాలి.. నీ నుంచి ఎంతో నేర్చుకున్నాను.. ఇంకా నేర్చుకోవాలి.. విన్నింగ్‌తో బయటకు రావాలి.. అదే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను.. అని ప్రియాంక తన మనసులోని మాటను బయటపెట్టేసింది. ఇక ప్రియాంక కోసం మానస్ తనకు ఇష్టమైన ఉప్పెనంత ప్రేమకు..అనే పాటను పాడాడు. దీంతో ప్రియాంక ఆనంద భాష్పాలను రాల్చింది. ప్రియా ప్రియా చంపొద్దే అనే పాటను శ్రీరామచంద్ర పాడాడు. అలా మొత్తానికి ఎపిసోడ్ సక్సెస్ ఫుల్ గా ముగిసింది.