అఖండ దెబ్బకు సౌండ్ బాక్స్ లు పగిలిపోతున్నాయి..తెరలు కాలిపోతున్నాయి

నందమూరి బాలయ్య అఖండ దెబ్బకు థియేటర్స్ బాక్స్ లు పగిలిపోవడమే కాదు తెరలు కాలిపోతున్నాయి. మొన్నటికి మొన్న అమెరికా లో ఓ థియేటర్ ఏకంగా నోటీసు అంటించింది. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కు సౌండ్ బాక్స్ లు తట్టుకోలేకపోతున్నాయని..అందుకే సౌండ్ తగ్గించమని..ప్రేక్షకులు గమనించగలరని పెట్టారు. ఇక ఇప్పుడు శ్రీకాకుళం లో ఏకంగా తెర వెనుక ఉన్న సౌండ్ బాక్స్ లు కాలిపోతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే..

శ్రీకాకుళం జిల్లాలో అఖండ షో వేస్తున్న సమయంలో ఒక్కసారిగా థియేటర్ సౌండ్ సిస్టం షార్ట్ సర్క్యూట్‌కు గురైంది.. స్క్రీన్ వెనుక ఉన్న సౌండ్ సిస్టం నుంచి మంటలు రావడంతో ప్రేక్షకులు భయాందోళనకు గురయ్యారు. శ్రీకాకుళంలోని రవిశంకర్ థియేటర్‌లో ఈ ఘటన జరగడంతో అప్రమత్తమైన యాజమాన్యం మంటలను అదుపులోకి తెచ్చింది.

ఇక అఖండ సినిమా వసూళ్ల విషయానికి వస్తే..

నైజాం – రూ 2.45 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 80 లక్షలు
తూర్పు గోదావరి – రూ. 55 లక్షలు
పశ్చిమ గోదావరి – రూ. 31 లక్షలు
కృష్ణ – రూ 41 లక్షలు
గుంటూరు – రూ. 41 లక్షలు
నెల్లూరు – రూ. 25 లక్షలు
సీడెడ్ – రూ 1.50 కోట్లు షేర్ ఈ చిత్రం వసూలు చేసింది. మొత్తంగా మూడో రోజు ఈ చిత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 6.68 కోట్లు రాబట్టింది.