ఆర్ఆర్ఆర్ సక్సెస్ సంబరాల్లో ఐటెం బాంబ్ హల్చల్

దర్శక ధీరుడు రాజమౌళి డైరెక్షన్లో ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు హీరోలుగా తెరకెక్కిన మల్టీస్టారర్ మూవీ ఆర్ఆర్ఆర్. గత నెల 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయం సాధించింది. మొదటి రోజు మొదటి ఆట తోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకోవడం తో విడుదలైన ప్రతి చోట వసూళ్ల ప్రభంజనం సృష్టిస్తుంది. రెండు వారాల్లో వరల్డ్ వైడ్ గా వెయ్యి కోట్లు రాబట్టి తెలుగు సినిమా సత్తాను చూపించింది. ఇక నార్త్ లోను ఈ మూవీ 200 కోట్లు రాబట్టి పలు రికార్డ్స్ నమోదు చేసింది. ఈ క్రమంలో ముంబై లో చిత్ర సక్సెస్ వేడుకలు అట్టహాసంగా జరిపారు. ఈ సక్సెస్ సంబరాల్లో హీరోలు ఎన్టీఆర్, చరణ్, దర్శకుడు రాజమౌళి పాల్గొన్నారు.

ఇక ఈ సెలబ్రేషన్స్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ అండ్ ఐటెం బాంబ్ రాఖీ సావంత్ స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. సెలబ్రేషన్స్ లో ‘నాటు నాటు ’ స్టెప్స్ వేసిన ఈ భామ..తన ఫేవరెట్ హీరో రామ్ చరణ్ ను కలిశానని చెప్పింది. తారక్ తోనూ ముచ్చటించిన ఈ సుందరి.. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా, అది నెట్టింట తెగ వైరలవుతోంది. ఇక ఈ చిత్రాన్ని నార్త్ లో పెన్ స్టూడియోస్ అధినేత జయంతి లాల్ డిస్ట్రిబ్యూట్ చేశారు.