అఖండ సక్సెస్ మీట్ కు మహేష్ , ఎన్టీఆర్ లు ముఖ్య అతిధులు..?

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయం సాధించింది..బాక్స్ ఆఫీస్ కు సరికొత్త సినీ కళను తీసుకొచ్చింది. విడుదలైన అన్ని సెంటర్లలో హౌస్ ఫుల్ కలెక్షన్లతో కుమ్మేస్తుంది. ఈ తరుణంలో డిసెంబరు 8న సక్సెస్​ మీట్ నిర్వహించాలని ప్లాన్ చేస్తుంది చిత్ర యూనిట్. ఈ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ , సూపర్ స్టార్ మహేష్ బాబు లు ముఖ్య అతిధులుగా రాబోతున్నట్లు సమాచారం. ఇక ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అల్లు అర్జున్ , రాజమౌళి లు హాజరై ఆకట్టుకున్నారు.

ఇక ఇప్పుడు సక్సెస్ మీట్ కు మహేష్ , ఎన్టీఆర్ లు రాబోతుండడం తో అభిమానుల సంబరాలు మాములుగా ఉండవని అర్ధమవుతుంది. ఈ సినిమాలో బాలయ్య ద్విపాత్రాభినయం చేశారు. ఆయన సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్​గా నటించింది. శ్రీకాంత్, జగపతిబాబు, పూర్ణ కీలకపాత్రలు పోషించారు. తమన్ సంగీతమందించారు. బోయపాటి శ్రీను దర్శకత్వం వహించారు.మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించారు.