సీజేఐ ఎన్వీ రమణకు ఘనస్వాగతం పలికిన మంత్రులు

హైదరాబాద్: భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. సీజేఐ హోదాలో ఎన్వీ రమణ తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చారు. ఎయిర్‌పోర్టులో ఎన్వీ రమణకు మంత్రులు కేటీఆర్‌, మహమూద్‌ అలీ, తలసాని, సబిత, ఇంద్రకరణ్‌రెడ్డి, పువ్వాడ అజయ్‌ సహా పలువురు స్వాగతం పలికారు. హైకోర్టు సీజే హిమాకొహ్లీ, సీఎస్ సోమేశ్ కుమార్‌, డీజీపీ మహేందర్ రెడ్డి తదితరులు కూడా సీజేకు స్వాగతం తెలిపారు.

మరోవైపు రాజ్‌భవన్‌కు సీఎం కేసీఆర్‌ చేరుకున్నారు. సీజేఐ ఎన్వీరమణకు స్వాగతం పలకనున్నారు. ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా రాజ్‌భవన్‌కు చేరుకుంటారు. మూడు రోజుల పాటు రాజ్‌భవన్ అతిథి గృహంలో ఆయన ఉండనున్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/