‘బిగ్ బాస్-4’ విన్నర్ అభిజిత్

మెగాస్టార్‌ చిరంజీవి సమక్షంలో ‘కింగ్‌’ నాగార్జున ప్రకటన

'బిగ్ బాస్-4' విన్నర్ అభిజిత్
‘Bigg Boss-4’ winner Abhijit

Hyderabad: బిగ్ బాస్4 షో ముగిసింది. అందరూ ఊహించినట్లే అభిజిత్ టైటిల్ గెలిచి విన్నర్ గా నిలిచాడు. ఇన్నాళ్ల ఉత్కంఠకు తెరదించుతూ.. మెగాస్టార్‌ చిరంజీవి సమక్షంలో కింగ్‌ నాగార్జున విన్నర్‌ను ప్రకటించారు.

టాప్‌ 2 స్థానంలో అఖిల్‌ నిలిచారు. అంతకు ముందు టాప్‌ 3 కంటెస్టెంట్స్‌గా మిగిలిన అభిజిత్‌, అఖిల్‌, సొహైల్‌లో.. 3వ స్థానం చాలంటూ రూ. 25 లక్షలతో బయటికి వచ్చేశాడు సొహైల్‌.

‘కింగ్‌’ నాగార్జున టోటల్‌ షోని ఆసక్తికరంగా నడిపిస్తే.. కాసేపు ఉన్నప్పటికీ మెగాస్టార్ చిరంజీవి  తన మాటలతో, మూమెంట్స్‌తో లాస్ట్ టైమ్‌ లాగే ఇప్పుడు కూడా క్రెడిట్‌ మొత్తం కొట్టేశారు.

తాజా ‘స్వస్థ’ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health/