బతుకమ్మ చీరలను పంపిణీకి ప్రభుత్వం సిద్ధం

తెలంగాణ రాష్ట్ర సర్కార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన బతుకమ్మ చీరలను ఆడబిడ్డలకు పంపిణీ చేసేందుకు రంగం సిద్ధమైంది. చేనేతకు చేయూత నివ్వాలనే ఆలోచనతో సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల మరమగ్గాలపై తయారైన చీరలు ఈనెల 15 నుంచి అన్ని జిల్లా కేంద్రాలకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా వెరైటీ డిజైన్ లను రూపొందించారు. ఈసారి 17 కొత్త వర్ణాలతో 17 డిజైన్స్‌లతో కలిపి మొత్తం 240 డిజైన్స్‌లో ఈసారి బతుకమ్మ చీరలను తయారు చేయించారు. గత ఏడాది 96 లక్షల చీరల పంపిణీ చేశారు. ఈ ఏడాది 10 వేల మంది చేనేత కార్మికులతో ఆరు నెలల నుంచి కోటి 18 లక్షల చీరలు తయారు చేయించడం జరిగింది. వీటిని బతుకమ్మ పండుగ ప్రారంభంకు ముందే అర్హులైన ప్రతి ఒక్కరికి పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకోంది. ఈ ఏడాది 340 కోట్ల రూపాయిలను చీరలకు ఖర్చు చేసింది ప్రభుత్వం. గడిచిన 5 సంవత్సరాలుగా బతుకమ్మ చీరలతో చాలా మందికి ఉపాధి లభిస్తుంది. 24 గంటల కరెంట్ ఉండడంతో 3 షిఫ్ట్‌లో కూలీలు పని చేస్తున్నారు.