మెగా పవర్ స్టార్ సినిమాలకు కొంతకాలం విరామం ఇవ్వబోతున్నారా..?

ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీ లో ఇదే చర్చ నడుస్తుంది. ప్రస్తుతం చరణ్ ..శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ ( ఆర్సీ15) లో నటిస్తున్నాడు. ఈ మూవీలో రామ్ చరణ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వాణి నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ మొదలైంది. మరోవైపు రామ్ చరణ్ 16వ సినిమా కూడా త్వరలోనే సెట్స్ కి వెళ్లాల్సి ఉంది. ఈ సినిమాని ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ క్రమంలో ఈ షూటింగ్స్ అన్నింటికీ కాస్త బ్రేక్ ఇచ్చి తన భార్య బిడ్డతో గడపాలని రామ్ చరణ్ భావిస్తున్నాడట.

చరణ్ తండ్రి కాబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. పెళ్లై దాదాపు పదేళ్ల తర్వాత ఆయన తండ్రి కాబోతున్నారు. ఈ వార్త ఆయన కుటుంబంలో మాత్రమే కాదు మెగా అభిమానుల్లోనూ ఆనందం నింపింది. ఎప్పుడెప్పుడు మెగా వారసుడు పుడతాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఉపాసనకు దాదాపు నెలలు నిండాయి. మరో నెలలో బిడ్డ పుట్టే అవకాశం ఉంది. దీంతో చరణ్ ఈ సమయంలో తన భార్య బిడ్డకు ఎక్కువ సమయం కేటాయించాలని భావిస్తున్నారట. అందుకే షూటింగ్స్ అన్నింటినీ పక్కన పెట్టి లాంగ్ లీవ్ తీసుకోవాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దాదాపు 2 నెలలు ఆయన షూటింగ్ కి దూరంగా ఉండాలి అని అనుకుంటున్నారట. మరి ఇది ఎంతవరకు నిజం అనేది చూడాలి.