గోవాలో కాంగ్రెస్ పార్టీ కి భారీ షాక్..

Big shock for Congress party in Goa..

కాంగ్రెస్ పార్టీ కి వరుస షాకులు తగులుతూనే ఉన్నాయి. కీలక నేతలంతా కూడా వరుస పెట్టి పార్టీ ని వీడుతున్నారు. కొంతమంది బిజెపి లోకి వెళ్తుంటే..మరికొంతమంది సొంత పార్టీ పెట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా గోవాలో కాంగ్రెస్ కు భారీ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ సీఎం దిగంబర్ కామత్ , ప్రతిపక్ష నేత మైఖైల్ లోబోలతో కలిసి మొత్తం 8మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు.

దిగంబర్ కామత్, మైఖైల్ లోబో, దేలిలాహ్ లోబో, రాజేష్ ఫలదేశాయ్, కేదార్ నాయక్, సంకల్ప్ అమోనకర్, అలెక్సో సీక్వెరియా, రుడాల్ఫ్ ఫెర్నాండేజ్ లు బుధవారం గోవా రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ను కలిశారు. కాంగ్రెస్ నేతల ఫిరాయింపుల పర్వంపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మనీష్ తివారీ గతంలో ‘‘కోకిల గొంతు గొణుగుతోంది, కోకిల పక్షి తప్పు చేసింది’’ అంటూ ట్వీట్ చేశారు. గోవా కాంగ్రెస్ పార్టీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరిన తర్వాత ఆ పార్టీకి ముగ్గురే మిగులుతారని గోవా బీజేపీ అధ్యక్షుడు సదానంద చెప్పారు. ఇది నిజంగా కాంగ్రెస్ పార్టీ కి పెద్ద దెబ్బ అని రాజకీయ విశ్లేక్షకులు చెపుతున్నారు. ఓ పక్క రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తూ..రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ ను అధికారం తీసుకొద్దామని అనుకుంటే..మరోపక్క ఉన్న కొద్దీ మంది నేతలు కూడా పార్టీకి రాజీనామా చేయడం టెన్షన్ పెడుతుంది.