జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ ‘పవర్’ పంచులు

జనసేన విస్తృతస్థాయి సమావేశంలో పవన్ కళ్యాణ్ వైసీపీ సర్కార్ ఫై ఓ రేంజ్ లో రెచ్చిపోయారు. వరుస పవర్ పంచులు వేశారు. మొన్నటి ఎన్నికల్లో 151 సీట్లు వచ్చిన వైసీపీకి..వచ్చే ఎన్నికల్లో 15 సీట్లే రావొచ్చేమో అన్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఢంకా భజాయించబోతుందన్నారు. అప్పుడు పాండవుల సభ ఎలా ఉంటుందో చూపిస్తా.. వైసీపీ నేతలకు సవాల్ విసురుతున్నా. ఏం చేస్తారో చేసుకోండి. తాటతీసి మోకాళ్ల మీద నించోబెడతా.. ప్రతి ఒక్కటి గుర్తుంచుకుంటా.. కాకినాడలో మా ఆడపడుచు మీద చేయి వేశారు. ప్రతి ఒక్కటి గుర్తుంది. మీరు బీహార్ నుంచి కిరాయి రౌడీలను తెప్పించుకోండి అని అన్నారు. వైసీపీ పార్టీ నేతలకు భయం ఏంటో నేర్పిస్తానని…. కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతానని హెచ్చరించారు. వైసీపీ దుష్టపాలనకు అంతమొందిచాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. తాను రాజకీయాల్లోకి ఇష్టంతో వచ్చానని… పొలంలో కలుపు మొక్కలను పీకినట్టు.. రాజకీయాల్లో కలుపు మొక్కలను పీకేస్తానని వైసీపీ నాయకులను హెచ్చరించారు.

‘నాకేమన్నా థియేటర్లు ఉన్నాయా..? మీ వైసీపీ నేతలకే ఉన్నాయి. కాకినాడ, నెల్లూరుల్లో థియేటర్లు ఎవరివి మీ వారివి కావా..? సినిమా టిక్కెట్లు ఎంతైనా పెట్టుకోని చావండి.. నాకేం అభ్యంతరం లేదు. మా కష్టార్జితంపై మీ పెత్తనం ఏంటీ..? భారతీ సిమెంట్సును పంచండి. ఓ పని చేయండి.. ఇళ్లల్లోకి వచ్చి మా బంగారాన్ని లాగేసుకోండి. వైసీపీ వాళ్లు మాట్లాడ్డం ఎప్పుడు నేర్చుకుంటారు..? అరవడం తప్ప..’ అంటూ పవన్ అన్నారు. వైసీపీ నేతల్లో అధికార మదం పెరిగింది.. భయం అంటే ఏమిటో నేను నేర్పిస్తా..అంటూ వరుస పంచులు వేశారు.