బైడెన్‌తో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని

అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపా..మోడి

modi-biden

న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్‌తో ప్ర‌ధాని నరేంద్ర మోడి ఫోన్‌లో మాట్లాడారు. ఈమేరకు ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ ను పెట్టారు. ‘అధ్యక్షుడిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలిపేందుకు జో బైడెన్ తో ఫోన్ లో మాట్లాడాను. అమెరికా, భారత్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాలని మేము నిర్ణయించాం. పలు ప్రాధాన్యతాంశాలు, సవాళ్లు మా మధ్య చర్చకు వచ్చాయి. కొవిడ్19 మహమ్మారి, వాతావరణ మార్పులు, ఇండో పసిఫిక్ రీజియన్ లో సహాయ సహకారాలు సహా పలు అంశాల గురించి మాట్లాడుకున్నాం’ అని మోడి తెలియజేశారు.
కాగా, బైడెన్‌, మోడి మ‌ధ్య జ‌రిగిన ఫోన్ సంభాష‌ణ‌పై అమెరికా కూడా ప్ర‌క‌ట‌న జారీ చేసింది. స్వ‌దేశంలో, విదేశాల్లో ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోపేతం చేయ‌డమే ముఖ్య ఉద్దేశ‌మ‌ని అమెరికా త‌న ప్ర‌క‌ట‌న‌లో చెప్పింది. ప్ర‌పంచ స‌వాళ్ల‌ను ఎదుర్కొనేందుకు ప్ర‌ధాని మోడితో క‌లిసి ప‌నిచేయ‌నున్న‌ట్లు కొత్త అధ్య‌క్షుడు బైడెన్ ఆస‌క్తిగా ఉన్నార‌ని ప్ర‌క‌ట‌న‌లో పేర్కొన్నారు. బైడెన్ ట్రాన్‌షిష‌న్ టీమ్ ఈ ప్ర‌క‌ట‌న జారీ ఈచేసింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/