సోము వీర్రాజుపై అంబటి రాంబాబు విమర్శలు

కాఫర్ డ్యామ్ పూర్తి కాకుండానే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం చేపట్టారన్న అంబటి

ambati-rambabu-gives-counter-to-somu-veerraju

అమరావతి : ఏపీలో పోలవడం ప్రాజెక్టుపై రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఏపీ జలవనరులశాఖా మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. దీనిపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పందిస్తూ ఈ విషయం తెలుసుకోవడానికి మీకు మూడు సంవత్సరాలు పట్టిందా? అని ఎద్దేవా చేశారు. మీకు అనుకూలమైన కాంట్రాక్టర్లు ఉంటే చాలు, మీకు ముడుపులు అందితే చాలు… అదే కదా టీడీపీ, వైస్సార్సీపీ ఆలోచనా విధానమని అన్నారు. కేంద్ర మంత్రి షెకావత్ గారి పర్యటన తర్వాత ఈ తప్పులన్నీ బయటకు వస్తున్నాయని చెప్పారు.

సోము వీర్రాజు వ్యాఖ్యలపై అంబటి రాంబాబు కూడా అదే స్థాయిలో సమాధానమిచ్చారు. తమ ప్రభుత్వమే కాదు, కేంద్ర జలశక్తి అడ్వైజర్ శ్రీరామ్ నాయకత్వంలో డయాఫ్రమ్ వాల్ పరిశీలించి వెళ్లిన కేంద్ర కమిటీ కూడా పరిస్థితిని నిర్ధారించలేకపోతోందని, ఈ విషయం కాస్త తెలుసుకోండని సెటైర్ వేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/national/