కాసేపట్లో టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ భేటీ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో టిడిపి – జనసేన కలిసి పోటీ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఇరు పార్టీల అధినేతలు పలుమార్లు కలిసి సీట్ల సర్దుబాటు, మేనిఫెస్టో , ప్రచారం తదితర అంశాల ఫై చర్చలు జరిపారు. ఈరోజు ఇరు పార్టీల సమన్వయ కమిటీ భేటీ కానుంది. టీడీపీ తరఫున అచ్చెన్నాయుడు, లోకేశ్, యనమల, పితాని, పయ్యావుల, తంగిరాల సౌమ్య.. జనసేన తరఫున నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేశ్, గోవింద్, మహేందర్ రెడ్డి, బొమ్మిడి నాయకర్, యశస్వి ఉమ్మడి మేనిఫెస్టోపై చర్చించనున్నారు. అలాగే ఎన్నికల వ్యూహాలు, ప్రచారం, సీట్ల సర్దుబాటుపై సమాలోచనలు జరిపే అవకాశం ఉంది.

ఇప్పటికే టీడీపీ సూపర్ సిక్స్ పేరుతో తొలి విడత మ్యానిఫేస్టోను చంద్రబాబు విడుదల చేశారు. మ్యానిఫేస్టోను ఈసారి ఉమ్మడిగా రూపొందించాలని నిర్ణయించారు. అందుకే రెండు పార్టీల నేతలు కలిసి కూర్చుని సమన్వయంతో మ్యానిఫేస్టోను రూపొందించనున్నారు. దీంతో పాటు చంద్రబాబు, పవన్ కల్యాణ‌్ కలసి పాల్గొనేలా సభలను ఏర్పాటు చేసేందుకు కూడా ఒక రోడ్డు మ్యాప్ ను రూపొందించనున్నారు.