తిరుమలలో నూతన అతిధి గృహానికి శంకుస్థాపన

bhumi pujan-for-the-construction-of-accommodation-complexes-of-karnataka-state-in-tirumala

తిరుపతి: ఏపి సిఎం జగన్‌, కర్ణాటక సిఎం బి.ఎస్‌.య‌డ్యూర‌ప్ప తిరుమలలో క‌ర్ణాట‌క స‌త్రాల ప్రాంతంలో రూ.200 కోట్లతో నూతనంగా నిర్మించ‌నున్న వసతి స‌ముదాయాల‌కు  ఈ రోజు ఉద‌యం భూమి పూజ చేశారు. తిరుమలలోని కర్ణాటక చారిటీస్‌కు 7.05 ఎకరాల భూమిని 50 సంవత్సరాల కాల పరిమితికి 2008లో టీటీడీ లీజుకు ఇచ్చింది. ఈ స్థలంలో టీటీడీ నిబంధనల మేరకు రూ.200 కోట్లతో నూతన వసతి సముదాయాల నిర్మాణం చేపట్టడానికి జూలైలో కర్ణాటక ప్రభుత్వం, టీటీడీ మ‌ధ్య అంగీకారం కుదిరింది. అంత‌కు ముందు క‌ర్ణాట‌క రాష్ట్ర ఎండోమెంట్ క‌మిష‌న‌ర్ రోహిణి సింధూరి ప‌వ‌ర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా నూత‌నంగా నిర్మించే వ‌స‌తి స‌మూదాయాల వివ‌రాలు తెలియ‌జేశారు. ఇందులో 242 యాత్రికుల వ‌స‌తి గ‌దులు, 32 సూట్ రూములు, 12 డార్మెట‌రీలు, క‌ల్యాణ‌మండ‌పం, డైనింగ్ హాల్ నిర్మాణంతోపాటు ప్రస్తుతం ఉన్న పుష్కరిణిని పున‌రుద్ధరిస్తారు. టీటీడీ ఈ నిర్మాణాలు పూర్తి చేసి కర్ణాటక ప్రభుత్వానికి అప్పగిస్తుంది.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/