కన్నప్ప సినిమాలో కాజల్..!

మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ కన్నప్ప లో మరో క్రేజీ హీరోయిన్ నటించబోతుంది. మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాని బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఎపిక్ మహాభారతం సీరియల్ ని డైరెక్ట్ చేసిన ముఖేష్ కుమార్ కన్నప్ప సినిమాని డైరెక్ట్ చేస్తుండడంతో సినిమా ఫై అంచనాలు పెరిగిపోతున్నాయి.

ఇప్పటికే ఈ సినిమాలో పెద్ద ఎత్తున తారాగణం నటిస్తుండగా..ఇక ఇప్పుడు కాజల్ కూడా ఈ సినిమాలో భాగం అయ్యింది. ఈ మూవీ లో కాజల్ అగర్వాల్ ఓ కీలక పాత్రలో కనిపించనున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇక ఈ మూవీ లో నటిస్తున్న స్టార్ హీరోలెవరు రెమ్యూనరేషన్ తీసుకోవడం లేదట..మోహన్ బాబు ఫై ఉన్న అభిమానంతో వారంతా సినిమాలో నటిస్తున్నారని తెలుస్తుంది. మరి ఇంత మంది ఈ మూవీలో నటిస్తుండడం తో సినిమా కలెక్షన్స్ టాలీవుడ్ రికార్డ్స్ ను బ్రేక్ చేస్తాది కావొచ్చని అంత లెక్కలు వేసుకుంటున్నారు.