పాతబస్తీ లో హై అలర్ట్..

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అరెస్ట్ నేపథ్యంలో పాతబస్తీలో హై అలర్ట్ కొనసాగుతుంది. రాజాసింగ్ అరెస్ట్ కు నిరసనగా నిన్నటి నుండి బేగం బజార్ తో పాటు పలు ఏరియాల్లో బంద్ కొనసాగుతుంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థన కోసం ముస్లింలు బయటికి వచ్చే అవకాశం ఉంది. ఆ సమయంలో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు పోలీసుల భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ మేరకు పాతబస్తీలోని పలు ప్రాంతాల్లో భద్రతా బలగాలు మోహరించాయి. చార్మినార్, మక్కా మసీద్ ఏరియాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ర్యాలీలు, ధర్నాలకు అనుమతి లేదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు.

మరోపక్క ప్రజలు శాంతి యుతంగా ఉండాలని ఎంపీ అసదుద్దీన్ పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాద్ నగర వాసులకు ఒవైసీ విజ్ఞప్తి చేశారు. పాతబస్తీ వాసులు ప్రశాంత వాతావరణంలో ఫ్రైడే ప్రేయర్స్ లో పాల్గొనాలన్నారు. నేడు శుక్రవారం మక్కా మసీదు లో ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు శాంతి యుతంగా జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి ద్వేషపూరితమైన చర్యలకు పాల్పడవద్దని హితవు పలికారు. హైదరాబాద్ లో శాంతి భద్రతలకు విఘాతం కలుగకుండా శుక్రవారం జుమ్మ ప్రత్యేక నమాజ్ ప్రార్థనలు జరుపుకోవాలని ఎంపీ అసదుద్దీన్ తెలిపారు.