ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌కు అనుమానాస్పద లేఖ

ఆగంతుకుడి నుంచి సాధ్వికి లేఖ.. కవర్‌లో రసాయన పొడి, కొన్ని ఫొటోలు

Pragya Thakur
Pragya Thakur

న్యూఢిల్లీ: బిజెపి ఎంపి సాధ్వి ప్రజ్ఞాసింగ్‌ ఠాకూర్‌ తనపై హత్య చేసేందుకు కుట్ర జరుగుతోందంటూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సాధ్వి ఇంటికి గుర్తు తెలియని వ్యక్తి నుంచి ఓ కవర్ వచ్చింది. దానిని ఆమె పీఏ విప్పి చూడగా అందులో తెల్లని పౌడర్ కనిపించింది. అది శరీరంపై పడగానే దురద మొదలైంది. అంతేకాదు, ఆ కవరులో సాధ్విని బెదిరిస్తూ కొన్ని లేఖలు, ఫొటోలు కూడా ఉన్నాయి. పోలీసులు ఇచ్చిన సమాచారంతో రంగంలోకి దిగిన ఫోరెన్సిక్ ల్యాబ్ బృందం బెదిరింపు లేఖలను పరిశీలించింది. అందులోని రాత ఉర్దూలో ఉందని పోలీసులు తెలిపారు. సాధ్వికి వచ్చిన లేఖలో పీఎం మోడి , కేంద్రమంత్రి అమిత్ షా, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్, యూపీ సీఎం ఆదిత్యనాథ్, కశ్మీర్ గవర్నర్, సాధ్వి ఫొటోలు ఉన్నాయి. వాటిని పెన్నుతో అడ్డంగా కొట్టేసినట్టు ప్రజ్ఞాసింగ్ తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/