దేశంలో కొత్తగా 5379 కరోనా కేసులు

క్రియాశీల కేసులు.. 50,594

corona virus- india

న్యూఢిల్లీః దేశంలో కరోనా రోజువారీ కేసులు స్వల్పంగా పెరిగాయి. మంగళవారం నుంచి బుధవారం ఉదయం 8 గంటల వరకు 5,379 మందికి కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధరణ అయింది. 27 మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్కరోజులో 7,094 మంది కరోనా నుంచి కోలుకున్నారు. రికవరీ రేటు 98.7కు పెరిగింది. యాక్టివ్​ కేసులు 0.11 శాతానికి పడిపోయాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో మంగళవారం 18,81,319 కోట్ల మందికి టీకాలు అందించగా.. ఇప్పటివరకు పంపిణీ చేసిన వ్యాక్సిన్​ డోసుల సంఖ్య 213.91 కోట్లకు చేరింది. ఒక్కరోజే 3,21,917 మందికి కరోనా నిర్ధరణ పరీక్షలు చేశారు.

కాగా, ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగాయి. కొత్తగా 486,032 కేసులు వెలుగుచూశాయి. ఒక్కరోజులో 1,413 మరణాలు నమోదయ్యాయి. మొత్తం కేసులు 610,613,899 చేరుకున్నాయి. ఇప్పటివరకు వైరస్​తో 6,506,895 మంది మరణించారు. మంగళవారం మరో 753,584 మంది కోలుకున్నారు. దీంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 588,727,760కు చేరింది.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/andhra-pradesh/