దీపికా పదుకొనేకు రామ్‌దేవ్‌ బాబా సలహా

ఏదైనా విషయంపై మాట్లాడే ముందు దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులు గురించి తెలుసుకుని ఉండాలి

ramdev baba
ramdev baba

న్యూఢిల్లీ: జవహర్‌లాల్‌ నేహ్రూ యూనివర్సీటీ విద్యార్థులకు సంఘీభావంగా బాలీవుడ్‌ నటి దీపికా పదుకొనే వెళ్లినందుకు ప్రముఖ యోగా గురువు రామ్‌దేవ్‌ బాబా స్పందించారు. ఈ సందర్భంగా ఆమెకు చురకలు అంటించారు. ఏదైనా విషయంపై స్పందించే ముందు దేశ సామాజిక, ఆర్థిక పరిస్థితులు గురించి తెలుసుకుని ఉండాలని దీపికా పదుకొనేకు సూచించారు. వాటిపై కనీస అవగాహన పెంచుకోవాలని, లేకపోతే మంచి సలహాదారుడిని నియమించుకుని, తెలుసుకునే ప్రయత్నం చేయాలని అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..దేశంలో రెండు కోట్లకు పైగా వలసదారులు అక్రమంగా నివశిస్తున్నారని అన్నారు. కేంద్ర ప్రభత్వుం ప్రవేశపెట్టిన సీఏఏ, ఎన్‌ఆర్‌సీ అమలు ద్వారా, అక్రమ వలసలను ఆరికట్టే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. కొందరు సొంత ప్రయోజనాల కోసం ఆందోళనలకు దిగుతున్నారని రామ్‌దేవ్‌ బాబా మండిపడ్డారు. జామియా విద్యార్థులు ఇప్పటికే జిన్హా వాలా జిందాబాద్‌ అంటూ నినాదాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/