వైఎస్ షర్మిల ఎవరో తెలియందంటూ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు

వైఎస్ షర్మిల ఎవరో తెలియందంటూ కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి కీలక వ్యాఖ్యలు చేసారు. తెలంగాణ లో అతి త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయం అంత ఖమ్మం జిల్లాలో నడుస్తుంది. రీసెంట్ గా ఖమ్మం కీలక నేత పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ లో చేరడం తో కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ పెరిగింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖమ్మం లో పదికి పది స్థానాలు గెలుస్తుందని ధీమా గా ఉన్నారు. కాగా పొంగులేటి , రేణుక లు ఒకే పార్టీ లో ఉండగా..త్వరలో వైస్ షర్మిల కూడా తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేయబోతుందనే ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో వైఎస్ షర్మిల ఎవరో తెలియందంటూ రేణుకా చౌదరి అనడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

షర్మిలది ఏపీ అని.. వాళ్ల సోదరుడు జగన్ కూడా అక్కడే ఉన్నారంటూ చెప్పుకొచ్చారు. తమ సొంత రాష్ట్రాన్ని వదిలిపెట్టి వాళ్లంతా ఖమ్మం జిల్లాలో ఎందుకుంటున్నారని రేణుకా చౌదరి ప్రశ్నించారు. ఎవరు వచ్చినా.. ఏం చేసినా ఖమ్మం నుంచి తనను పంపే మొనగాడే లేడంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అడ్రస్ లేకుండా పోతారంటూ ఘాటు కామెంట్లు చేశారు. YSRTP పార్టీ పెట్టిన దగ్గరి నుండి కూడా షర్మిల పాలేరు నుండి పోటీ చేస్తానని చెప్పుకుంటూ వస్తుంది. ఇప్పటికే పొంగులేటి రాకతో ఖమ్మంలో రేణుకా చౌదరి పట్టు కోల్పోనున్నట్టు ఆమె అభద్రతా బావంతో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా.. ఇప్పుడు షర్మిల కూడా వస్తే తనకు ఇబ్బందేనని రేణుక భావిస్తుందని , అందుకే ఇలా మాట్లాడి ఉంటుందని అంత మాట్లాడుకుంటున్నారు.