భారీ సెట్‌లో చిరంజీవి, తమన్నా, కీర్తిసురేశ్‌ అదిరిపోయే స్టెప్స్

చిరంజీవి, తమన్నా, కీర్తిసురేశ్‌ ప్రధాన పాత్రలో మెహర్ రమేష్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న చిత్రం భోళా శంకర్. రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం షూటింగ్ చివరి దశకు చేరుకుంది.

మొన్నటి వరకు స్విట్జర్లాండ్ లో పలు సన్నివేశాలు , పాటల షూటింగ్ జరుపుకున్న యూనిట్..తాజాగా హైదరాబాద్ లో వేసిన భారీ సెట్ లో చిరు, తమన్నా , కీర్తి ల కలయికలో సాంగ్ షూట్ చేస్తున్నారు. ఈ పాటకు శేఖర్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందిస్తున్నారు.