NBK108 టైటిల్ ‘భగవంత్‌ కేసరి’

NBK108 టైటిల్ ప్రకటన చేసారు. ‘భగవంత్‌ కేసరి’ అనే టైటిల్ పవర్ ఫుల్ టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అధికారిక ప్రకటన చేసారు. నందమూరి బాలకృష్ణ, కాజల్ జంటగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మాస్, యాక్షన్ మూవీకి ఎలాంటి టైటిల్ పెడతారో అని అంత ఎదురుచూస్తుండగా.. మరో రెండు రోజుల్లో బాలయ్య పుట్టినరోజు వస్తుండగా.. ఆయన అభిమానులకు ముందుగానే పండగ వాతావరణాన్ని తీసుకొస్తూ ఈరోజు ఆయన 108వ సినిమా టైటిల్‌ను విడుదల చేశారు.

గత కొద్ది రోజులుగా ప్రచారంలో ఉన్న ‘భగవంత్ కేసరి’ అనే టైటిల్‌నే ఖరారు చేస్తూ పోస్టర్ వదిలారు. ‘ఐ డోంట్ కేర్’ అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాలో బాలకృష్ణ పోషించిన పాత్ర పేరే సినిమా టైటిల్‌గా పెట్టడం జరిగింది. ఈ పోస్టర్‌లో బాలకృష్ణ లుక్ చూసి అభిమానులు ఫిదా అయిపోతున్నారు. టీజర్ ఎప్పుడు అంటూ దర్శకుడు అనిల్ రావిపూడిని, నిర్మాతలను సోషల్ మీడియాలో అడుగుతున్నారు. ‘గిప్పడి సంది ఖేల్‌ అలగ్‌’ అంటూ దర్శకుడు అనిల్‌ రావిపూడి ట్వీట్‌ చేశారు. ‘అన్న దిగిండు.. ఇగ మాస్‌ ఊచకోత షురూ’ షైన్‌స్ర్కీన్‌ సంస్థ ట్విట్టర్‌లో పేర్కొంది. ప్రస్తుతం ఈ లుక్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. ఈ మూవీ లో శ్రీలీల కీలక పాత్రలో కనిపించనుంది. షైన్‌ స్ర్కీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీశ్‌ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దసరా కానుగా ఈ చిత్రం విడుదల కానుంది.