కుమారుడి ప్రాణాలు కాపాడి తండ్రి మృతి

వినీస్‌ మెరీనా బీచ్‌ వెళ్లిన మాజీ రెజ్లర్‌ షాద్‌ గాస్పర్డ్‌ మృతి

కుమారుడి ప్రాణాలు కాపాడి తండ్రి మృతి
Wrestler-Shad-Gaspard

కాలిఫోర్నియా: అమెరికాలోని కాలిఫోర్నియాలో వినీస్‌ మెరీనా బీచ్‌లో మాజీ రెజ్లర్‌ షాద్‌ గాస్పర్డ్‌ (39) ప్రాణాలు కోల్పోయాడు. బీచ్‌లో ఈతకు వెళ్లి తన కుమారుడు సముద్రంలో మునిగిపోతోన్న నేపథ్యంలో అతడిని కాపాడే క్రమంలో గాస్పర్డ్‌ మృతిచెందారు. గాస్పర్ట్‌ తన పదేళ్ల కుమారుడితో ఈతకు వెళ్లాడు. వాళ్లిద్దరూ ఈత కొడుతుండగా ఓ భారీ అల వచ్చింది. తండ్రీ కొడుకులు ఆ అలల్లో చిక్కుకోవడంతో తాము ఆయనను రక్షించేందుకు పయత్నించినా లాభం లేకుండా పోయిందని అక్కడి సిబ్బంది తెలిపారు. గాస్పర్డ్‌ ముందు తన కుమారుడిని రక్షించాలని కోరాడని, దీంతో తాము ఆ బాలుడిని తీసుకొని ఒడ్డుకు చేర్చామని, అనంతరం వెంటనే గాస్పర్డ్‌ కోసం వెతికగా అతడు అప్పటికే సముద్రంలోకి కొట్టుకుపోయాడని తెలిపారు. 2010లో గాస్పర్డ్‌ డబ్ల్యూడబ్ల్యూఈ నుంచి రిటైరయ్యాడు. అనంతరం సినిమాల్లో నటిస్తున్నాడు. కాగా అమెరికాలో కరోనా వైరస్ విజృంభిస్తోన్న నేపథ్యంలో కొన్ని రోజులుగా బీచ్‌లలోకి అనుమతించలేదు. ఇటీవలే ఆంక్షలు సడలించడంతో సందర్శకులు బీచ్‌ల వద్దకు వచ్చారు. ఈ క్రమంలోనే గాస్పర్డ్‌ తన కుమారుడు ఆర్యేహ్‌ (10) కలిసి అక్కడకు వెళ్లి ఈత కొడుతుండగా ఓ భారీ అల రావడంతో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.


తాజా వీడియోస్‌ కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/videos/