రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా

,

బాలీవుడ్ బ్యూటీ మలైకా అరోరా రోడ్డు ప్రమాదానికి గురైంది. శనివారం పూణెలోని ఓ ఫ్యాషన్ ఈవెంట్‌లో పాల్గొన్న ఆమె తిరిగి ఢిల్లీ వస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఆమె నుదిటిపై స్వల్పంగా గాయాలయ్యాయి. దీంతో ఆమెను వెంటనే ముంబైలోని అపోలో ఆసుపత్రికి తరలించారు. మలైకా నుదిటిపై స్వల్పంగా గాయాలయ్యాయని, సీటీ స్కాన్‌లో అంతా బాగానే ఉందని అపోలో వైద్యులు తెలిపారు. ఈరోజు ఆదివారం ఆమెను డిశ్చార్జ్ చేయనున్నట్లు తెలిపారు. ముంబై-పూణె ఎక్స్‌ప్రెస్ హైవేపై ఖలాల్‌పూర్ టోల్ ప్లాజా సమీపంలో మూడుకార్లు ఒకదాన్నొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలోనే ఆమె గాయపడినట్టు తెలుస్తోంది. మలైకా ఆరోగ్యం నిలకడగా ఉందని ఆమె సోదరి అమృతా అరోరా తెలిపారు.

ప్రమాద సమయంలో కారును డ్రైవర్ నడుపుతుండగా, ఆమెతోపాటు బాడీగార్డ్ కూడా ఉన్నాడు. మలైకా ప్రమాదానికి గురైందని వార్త తెలిసి అభిమానులు, సినీ ప్రముఖులు ఖంగారు పడ్డారు. కానీ ఆమె క్షేమంగా ఉందని తెలిసి ఊపిరి పీల్చుకున్నారు. హిందీ లో పలు సినిమాల్లో , హాట్ సాంగ్స్ లలో నటించిన ఈమె..తెలుగు లోను పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గబ్బర్ సింగ్ మూవీ లో ఐటెం సాంగ్ లో చిందులేసి తెలుగు ప్రేక్షకులను అలరించింది. ప్రస్తుతం ఈమె సినిమా ఛాన్సులు లేకపోయినా సోషల్ మీడియా లో నిత్యం యాక్టివ్ గా ఉంటూ హాట్ హాట్ ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అలరిస్తుంది.