బస్సు వాగులో పడడానికి కారణం బైక్ అడ్డు రావడమేనా..?

ప.గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం జల్లేరులో వాగులో బుధువారం మధ్యాహ్నం ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందగా..పలువురికి గాయాలు అయ్యాయి. ప్రస్తుతం బస్సు ప్రమాదంపై పోలీసులు విచారణ చేపట్టారు. బస్సు 20 మీటర్ల దూరం నుండి అదుపు తప్పిందని, బస్సులో 47 మంది ఉన్నారని, ప్రమాదంలో 9 మంది చనిపోయారని ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ మీడియా కు తెలియజేసారు.

బస్సు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని సందర్శించిన ఆయన ఎదురుగా వచ్చిన బైక్‌ని తప్పించబోయి బస్సు వాగులో పడిపోయి ఉంటుందని తెలిపారు. బస్సు ప్రమాదం జరిగిన ప్రదేశంలో గతంలో లారీ బోల్తా పడింది. జల్లేరు వాగుపై అప్పట్లోనే ధ్వంసం వంతెన రైలింగ్ ధ్వంసం అయింది. అయినా ఆర్ అండ్ బి అధికారులు పట్టించుకోలేదు. ఆ వంతెన రైలింగ్ ఉండి ఉంటే ప్రమాద తీవ్రత ఈస్థాయిలో ఉండేది కాదంటున్నారు స్థానికులు. బస్సు ప్రమాదం ఫై ముఖ్యమంత్రి తో సహా పలువురు రాజకీయ నేతలు దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా ప్రకటించారు ముఖ్యమంత్రి జగన్. ప్రమాదం పట్ల ఆయన దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు ఆదేశాలు జారీచేశారు.