టిఆర్ఎస్ పార్టీ కి ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్య అనుచరుడు షాక్

తెలంగాణ లో అధికార పార్టీకి చెందిన నేతలు వరుస పెట్టి పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే పలువురు పార్టీ కి రాజీనామా చేసి బిజెపి , కాంగ్రెస్ పార్టీ లలో చేరగా..తాజాగా ఎమ్మెల్యే బాల్క సుమన్ ముఖ్య అనుచరుడు చెరుకు నరోత్తం రెడ్డి పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు. పార్టీలో ఉద్యమకారులకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆరోపిస్తూ..ఆత్మగౌరవంతోనే టీఆర్ఎస్ నుంచి బయటకు వస్తున్నట్లు చెప్పుకొచ్చారు.

ఎమ్మెల్యే బాల్క సుమన్ చెన్నూరు నియోజకవర్గానికి చేసిందమీ లేదని, భీమారం మండలానికి ఇచ్చిన హామీలను సుమన్ విస్మరించారని నరోత్తం ఆరోపించారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కొందరికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. నాతో పాటు చాలా మంది నేతలు టీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వస్తున్నారని.. 3, 4 రోజుల్లో మూకుమ్మడి రాజీనామాలు ఉంటాయని తెలిపారు. మరి నరోత్తం నెక్స్ట్ స్టెప్ ఏంటి..ఏ పార్టీ లో జాయిన్ అవుతారు అనేది తెలియాల్సి ఉంది.