నైపుణ్యమనే హలంతో చదువుల సేద్యం సాగాలి

నైతిక విలువలు నేర్పే వాతావరణం ఉండాలి

Education
Education

నాటి సమాజంలో పెద్దరికం కూడా సజావుగానే ఉండేది. న్యాయన్యాయాలు, సత్యాసత్యాలు పెద్దల తీర్పుల ద్వారా బహిర్గతమయ్యేవి. న్యాయస్థానాలతో పనిలేకుండా కేవలం రచ్చబండపై నిజాయితీ గల తీర్పులు వెలువడేవి.

నాటితరం పెద్దల సత్ప్రవర్తన, హుందాతనం నాటి చదువులు ప్రసాదించిన విలువలు అలాంటివి. అయితే ఇప్పటి చదువులు నేతిబీరకాయ చందంగా తయారైంది. చదువుల్లో నాణ్యత క్షీణించింది. నైతిక విలువలు నేర్పే చదువులు కనుమరుగైనాయి. తత్ఫలితంగానే నేటి సమాజం మేడి పండులా తయారైనది.

భారతదేశంలో ‘విద్యావ్యవస్థ ప్రాచీనకాలం నుండే వ్యాప్తి లో ఉన్నది. నాగరికతకు నెలవైన భారతదేశంలో పూర్వకాలంలోనే గురుకులాల పేరిట విద్యావ్యవస్థ మనుగడలో ఉంది. అయితే నాటి కాలంలో విద్య అందరికీ అందుబాటులో ఉండేదికాదు. కఠోరమైన నియమాలతో క్రమశిక్షణతో సాగిన ప్రాచీన విద్య నైతిక విలువల బోధనకు అగ్రతాంబులమిచ్చేది.

వినయం, వివేకం, పెద్దల పట్ల గురువ్ఞల పట్ల గౌరవభావం నాటి విద్యావ్యవస్థ అందించేది. న్యాయం, ధర్మం, నీతి ఆధా రంగా సాగిన నాటి విద్యలన్నీ సంస్కృతంలో బోధించబడేవి. సంస్కృత భాష ప్రపంచంలోనే అతి పురాతనమైనది. ప్రాచీన లిఖితభాషల్లో సంస్కృత భాషకు సముచిత స్థానం లభించింది.

ప్రపంచంలో కెల్లా అతి పురాతనమైన లిఖితభాష సుమేరియన్‌, ఈజిప్షియన్‌, లాటిన్‌ భాషలు,సైగలతో, శబ్దాలతో, భావవ్యక్తీకరణ చేయడం వలన కలిగే ఇబ్బందుల వలన ప్రతీ భాషకు లిపి ఉండా లని భావించడం వలనే లిఖిత భాషలు ఆవిర్భవించాయి. భాషకు అక్షరాలు తోడుకావడం వలన విజ్ఞానం వికసించింది.

ఒకరి భావా లను మరొకరు అతి సులభంగా గ్రహించగలగడం తమ అభి ప్రాయాలకు అక్షరరూపం రావడంతో ప్రపంచంలో జరిగే సంఘ టనలన్నీ తెలుసుకునే జ్ఞానం అలవడింది. మతాల ఆధారంగా సాగే విద్యావ్యవస్థ దాదాపుగా అంతరించిన విజ్ఞాన శాస్త్రరంగాలు పురోగతి సాధించాయి.

భారతదేశంలో లిఖితభాషలున్న రోజుల్లో ఆంగ్లభాష అస్థిత్వం లేదు. సుమారు 9వ శతాబ్దంవరకు ఆంగ్ల భాషకు ఉనికేలేదు.నలంద, తక్షశిల వంటి ప్రాచీన విశ్వవిద్యాల యాల ఘనకీర్తి విశ్వవ్యాప్తం. దీనిని బట్టి భారతదేశ విద్యావ్యవస్థ ప్రాశస్త్యం అవగతమవుతుంది.

అయితే మారిన కాలానికి అనుగు ణంగా అలనాటి విద్యావిధానం మారకపోవడం, ఉపాధికి మార్గం చూపకపోవడం,విదేశీయుల దండయాత్రవలన పరిపాలనా పగ్గాలు పరాయి పాలకుల చేతుల్లో ఉండటం వలన మన విద్యావిధానం, విదేశీ పాలకుల చేతుల్లోకి పోయింది.బ్రిటిషువారు భారత దేశాన్ని వదిలివెళ్లిన తర్వాత కూడా భారతదేశం సరైన విద్యావ్యవస్థను రూపొందించుకోలేకపోయింది.

ఆడపాదడపా విద్యావిధానంలో మార్పులు జరిగినా పెద్దగా ఫలితం చేకూరలేదు. మెకాలే విద్యావిధానమే నేటికీ కొనసాగుతున్నది. కాలక్రమంలో విద్యలన్నీ అందరికీ అందుబాటులోకి వచ్చాయి. ఆధునిక యుగంలో శాస్త్ర సాంకేతిక విప్లవం వెల్లివిరిసింది. ఆంగ్లభాష అంతర్జాతీయ భాషగా అవతరించింది. ఆంగ్లభాషను బ్రిటిషువారు ఇండియాలో ప్రవేశ పెట్టడానికి కారణం భారతదేశంలో తమ పరిపాలనలో ఇండియన్ల అవసరం ఉందికనుక.

బ్రిటిషువారి కాలంలో భారత్‌లో కేవలం10 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది.తమ పరిపాలనలో సహకరించ డానికి భారతీయులకు ఆంగ్ల విద్యఅవసరం.ఆ క్రమంలోనే భారత్‌ లో ఆంగ్ల విద్యకు బీజంపడింది. ఏది ఏమైనప్పటికీ ఆంగ్ల విద్యా వ్యాప్తి వలన భారతదేశానికి మేలే జరిగింది. నేటి ఆధునిక కాలంలో భారతదేశం అభివృద్ధి పథంలో సాగాలన్నా, మానవ వనరులు సక్రమ పద్ధతిలోవినియోగపడాలి.

యువత దేశానికి ఆలంబన కావాలి.చదువ్ఞలు ప్రశాంతమైన వాతావరణంలోసాగాలి. ఒత్తిడిలేని చదువ్ఞలే మానసిక పరిపక్వతకు దారితీస్తాయి. ఒకప్పటి చదువ్ఞలు క్రమశిక్షణతో, నైపుణ్యంతో విలువలతో వికసించేవి. ఇప్పటిలా కాకుండా అప్పటి విద్యార్థుల్లో ప్రతీ అంశంలో అవగా హన ఉండేది.అన్ని విషయాల్లో నిష్ణాతులుగా ఉండేవారు. బాల్య దశ నుండే తల్లిదండ్రులపట్ల పెద్దలపట్ల ఎలా మెలగాలో నేర్పించే వారు.గురువులపట్ల భక్తి ప్రపత్తులు మెండుగా ఉండేవి.

విద్యావకా శాలు అరకొరగా ఉండే నాటి రోజుల్లో ఉద్యోగావకాశాలు కూడా అంతంతమాత్రంగానే ఉండేవి. అయితే ప్రతీ ఒక్కరూ విద్యను విజ్ఞాన సాధనంగా ఎంచుకుని ఎవరి కులవృత్తుల్లో వారు స్థిరపడి హాయిగా జీవించేవారు. నాటి సమాజంలో పెద్దరికం కూడా సజావుగానే ఉండేది. న్యాయన్యాయాలు, సత్యాసత్యాలు పెద్దల తీర్పుల ద్వారా బహిర్గతమయ్యేవి.

న్యాయస్థానాలతో పనిలేకుండా కేవలం రచ్చబండపై నిజాయితీ గల తీర్పులు వెలువడేవి. నాటి తరం పెద్దల సత్ప్రవర్తన, హుందాతనం,నాటి చదువులు ప్రసాదిం చిన విలువలు అలాంటివి.అయితే ఇప్పటి చదువ్ఞలు నేతిబీరకాయ చందంగా తయారైనాయి.

చదువుల్లో నాణ్యత క్షీణించింది. నైతిక విలువలు నేర్పే చదువ్ఞలు కనుమరుగైనాయి. తత్ఫలితంగానే నేటి సమాజం మేడి పండులా తయారైంది. కుట్రలు, కుయుక్తులతో కూడిన శకుని వ్యూహాలు పదునెక్కాయి. తేనె పూసిన కత్తుల్లా మాయమాటలతో సమాజాన్ని మభ్యపెడుతున్నారు.

కడుపులో కత్తులు పెట్టుకుని బయట కౌగిలింతల నటనతో కృత్రిమంగా జీవిస్తున్నారు.కూటి కోసం కోటివిద్యలు అన్న నానుడి రూపాం తరం చెంది భుక్తికోసమే భజన అన్నట్టుగా తయారైనది. పెంప కాలు సరిగా లేవ్వు. చదువుల్లో విలువలులేవ్ఞ.దీని కంతటికి కారణం నేటి విద్యావిధానం. బతుకు తెరువుకే కాని సక్రమంగా బతక డానికి నేటి చదువులు దారిచూపడం లేదు.వంచనతో బతికేందుకే దారులు అధికంగా ఉన్నాయి.

అందుకే విద్యావ్యవస్థలో మార్పు లు రావాలి. క్రమశిక్షణకు, నైతిక విలువలకు నేటి పాఠ్యాంశాల్లో చోటివ్వాలి. జంతుప్రవృత్తిలోకి జారిపోతున్న మానవ సమాజాన్ని కాపాడాలంటే భావిపౌరులను సన్మార్గంలో పయనింపచేయాలి. విద్యావిధానంలో సామాజికపరమైన అంశాలకుప్రాధాన్యతనివ్వాలి. ఎలా బతకాలో దారిచూపించాలి. బాధ్యతాయుతమైన పౌరులుగా తయారు చేయాలి.
కస్తూరీ రంగన్‌ సిఫార్సుల మేరకు భారత జాతీయ విద్యావిధానంలో కేంద్రప్రభుత్వం మార్పులు తీసుకు రావడం ముదావహం.

మాతృభాషలకు ప్రోత్సాహం, నైపుణ్యాలను పెంపొందించడం,ప్రభుత్వ విద్యను,ప్రైవేట్‌విద్యకు ధీటుగా తీర్చిదిద్దడం, లింగ వివక్షత లేని విద్యావకాశాలను అందరికీ సమానంగా అందించడం,విలువైన విద్యాబోధన, ఉపాధ్యాయ కోర్సుల్లో భారీ మార్పులు చేయడం నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ-2020 (ఎన్‌. ఇ.సి)ప్రధాన లక్ష్యం.1

0+2 విద్యావ్యవస్థను 5+3+3+4గా మార్చడం వంటి సంస్కరణలు మన విద్యా వ్యవస్థలో సవ్యమైన మార్పులు తీసుకురావాలని ఆశించడంలో అతిశయోక్తిలేదు.

భారత జాతీయ విద్యా విధానంలో జరిగిన మార్పులు ఆమోదయోగ్యమైనవి. ఆచరణలో ఎంతవరకు సఫలీకృతమవ్ఞతాయో కొంతకాలం వేచిచూడక తప్పదు.

-సుంకవల్లి సత్తిరాజు

తాజా స్వస్థ (ఆరోగ్యం జాగ్రత్తలు) కోసం : https://www.vaartha.com/specials/health1/