కృత్రిమ మేధతో విపత్కర పరిస్థితులకు పరిష్కారం

2030 కి అంతర్జాతీయ జిడిపికి 15.7 ట్రిలియన్‌ డాలర్లను
సమకూర్చగల సత్తా ఉందని అంచనా

Artificial intelligence
Artificial intelligence

ప్రస్తుతం మనం ఉన్న అంతర్జాల యుగంలో కృత్రిమ మేధస్సు తన ఉనికిని పెంచుకుంటోంది.

వ్యాపార, వాణిజ్య రంగాలలో మాత్రమే కాకుండా ఆర్థిక రంగంలో కూడా కృత్రిమ మేధ సామర్థ్యాలను వినియోగించుకొని అభివృద్ధి వైపు పరుగులు తీస్తున్నా యి అమెరికా, చైనా వంటి దేశాలు. మనదేశం కూడా ఇప్పుడిప్పుడే ఆ దిశగా బుడిబుడి నడకలు సాగిస్తోంది.

రెండు సంవత్సరాల క్రితమే నీతి ఆయోగ్‌ సార ధ్యంలో కృత్రిమ మేధ వినియోగంపై జాతీయ విధానాన్ని రూప కల్పన చేయడానికి క్రియాశీల బృందాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాని నేటికీ కృత్రిమ మేధ వినియోగం ఇంకా బాల్య దశలోనే ఉంది.

మనదేశంలో 2020లో నిర్వహించిన (రైజ్‌) కృత్రిమ మేధద్వారా సామాజిక సాధికారత ‘సదస్సు కృత్రిమ మేధ వినియోగంపై అవగాహన కల్పించడమేకాక ఆచరణాత్మకంగా అనేక రంగాల్లో దీని వినియోగంపై కల అవకాశాలను ఆవిష్కరిం చింది.

గత కొద్ది కాలంగా కృత్రిమ మేధ కేవలం సమర్థవంతమైన సాంకేతికతగానే కాకుండా జాతీయ ప్రాముఖ్యం గల సాధనంగా అవతరించింది. వినియోగదార్ల మార్కెట్లో కృత్రిమ మేధ వినియో గం అమెరికా, చైనా వంటి దేశాల్లోని డిజిటల్‌ మార్కెటింగ్‌, ఇ-వాణిజ్య దిగ్గజాల పోటాపోటీ వాణిజ్య ప్రకటనలతో ఈ మార్కెట్ల విలువ అనూహ్యంగా పెరిగిపోయాయి.

2030 నాటికి అంతర్జాతీయ జిడిపికి 15.7 ట్రిలియన్‌ డాలర్లను సమకూర్చగల సత్తా కృత్రిమ మేధకు ఉందని అంచనా వేస్తున్నారు.

భారత దేశానికి సంబంధించినంత వరకు అతిపెద్ద సామాజిక సవాళ్లను సంప్రదాయ కంప్యూటర్ల పరిజ్ఞానం ఎక్కడైతే విఫలమయ్యిందో అక్కడ కృత్రిమ మేధ తన సామర్థ్యాన్ని నిరూపించుకోనున్నది. మనదేశంలో నేటికీ 70 శాతం మందికి జీవనాధారం వ్యవసాయం మాత్రమే.

గత కొంతకాలంగా దేశ జిడిపిలో వ్యవసాయరంగం తనవాటా నిలబెట్టుకోవడానికి అష్టకష్టాలు పడుతోంది.

అదేవిధంగా మనదేశంలో మౌలిక వసతుల లేమి వల్ల సరైన రోడ్లు లేక రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి.

2016లో ప్రతి గంటకు రోడ్డు ప్రమాదాల వల్ల 16 మంది మరణించారు. అదేవిధంగా వైద్య,ఆరోగ్యరంగాల్లో కూడా అత్యాధునిక సాంకేతికతను అందుకో లేకపోవటం వల్ల ఐదు ట్రిలియన్‌ డాలర్లు ఆదాయాన్ని మనదేశం కోల్పోనున్నది.

ఆయా రంగాల్లో కోల్పోతున్న ఆదాయాన్ని తిరిగి పొందాలంటే పెద్దఎత్తున మౌలిక సదుపాయాలు కల్పించడానికి అవసరమైన భారీ నిధులను సమకూర్చుకోవలసి ఉంటుంది.

సరైన నిధులు సమకూరక, మార్కెట్లో ఉన్న గిరాకీని అందుకోలేక మనదేశ మౌలిక రంగాలు వెనుకబడిపోతున్నాయి అనటంలో ఏ సందేహం లేదు.

ఇటువంటి సమస్యల సాధనకు జరిగే అధు నాతన పరిశోధనకు కృత్రిమ మేధ సహాయం తీసుకోవడం వల్ల తక్కువ ఖర్చుతోనే పరిష్కార మార్గాలు కనుగొనవచ్చు. నాల్గోవ పారిశ్రామిక విప్లవాన్ని ప్రపంచం ఎదుర్కొంటున్న ఈ తరుణంలో మనదేశం కృత్రిమ మేధను అత్యంత వేగంగా ప్రతిరంగంలో జొప్పించడానికి ముందుండాలి.

కృత్రిమ మేధను పరిశ్రమల్లో వినియోగించడం ద్వారా కిందిస్థాయి కార్మికుల అవసరం తగ్గిపోవడమే కాక అతిచౌకగా వస్తు ఉత్పత్తి జరుగుతుంది.

ఈ తరుణంలో కృత్రిమ మేధను వినియోగించుకోవడంలో మనం వెనుకంజవేస్తే డిజిటల్‌ అంతరాల మధ్యపడి నలిగిపోవాల్సి వస్తుంది.

ఆక్సెంచర్‌ సంస్థ ప్రకటించిన ‘అభివృద్ధి కార్యోన్ము ఖులవ్వాలి నివేదికలో కృత్రిమ మేధ ద్వారా భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అదనంగా 957 బిలియన్‌ డాలర్ల ఆదాయం 2035 నాటికి సమకూరగలదని ఒక అంచనా వేయడం జరిగింది.

కరోనా నేపథ్యంలో ఏర్పడ్డ విపత్కర పరిస్థితుల్లో కుంటుపడిన మన ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొత్తదారు ల్లో అడుగంటిన మన ఆర్థిక వ్యవస్థకు జవసత్వాలు అందాలంటే అది ఒక్క కృత్రిమ మేధతోనే సాధ్యం.

కృత్రిమ మేధ, యంత్ర అభ్యాసన వంటి సాంకేతిక అంశాలు భవిష్యత్తుకు బాటలు వేస్తాయి అనటంలో ఏ సందేహం లేదు.

అదే సమయంలో వీటి వినియోగం వల్ల పెద్దఎత్తున పరిశ్రమల్లో ఉద్యోగాలు హరించుకు పోతాయి అనే అనుమానాలు చాలా మందిలో నెలకొన్నాయి. కాని నిజానికి కిందిస్థాయి ఉద్యోగాల స్థానంలో అంతకన్నా ఎక్కువ సంఖ్యలో నైపుణ్యాలు కల యువతకు ఉద్యోగాలు లభిస్తాయి.

కరోనా సమయంలో పెద్ద ఐటి పరిశ్రమలన్నీ తమ ఉద్యోగులు ఇంటి నుండే పనిచేయడానికి అవకాశం కల్పించాయి. కాని ఐటియేతర భారీ పరిశ్రమల్లో ఈ విధానం పనికిరాదు. అటువంటి పరిస్థితుల్లో కృత్రిమ మేధతో కూడిన యంత్రాలను ప్రత్యామ్నా యంగా ఉపయోగించుకోకతప్పదు.

నేడు నెలకొన్న విపత్కర పరిస్థితులను ఎదుర్కోవడానికి పరిశ్రమలు సరికొత్త మార్గాలు అన్వేషిస్తున్నాయి.

భారీ ప్రణాళికలు, అత్యుత్తమ విధానాలు కల పరిశ్రమలు సైతం కరోనా వల్ల ఏర్పడ ఊహించని పరిస్థితులను ఎదుర్కోవడానికి ఇబ్బంది పడుతున్నాయి.

ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా వల్ల గుణపాఠాలు నేర్చుకుని పూర్తివైభవం సంతరించుకోవడానికి అనేక వినూత్న పరిష్కారాలవైపు దృష్టి సారిస్తున్నాయి.

ఇటువంటి పరిస్థితులను తిరిగి సాధారణ స్థితికి తీసుకురాగల శక్తి కేవలం కృత్రిమ మేధకు మాత్రమే ఉన్నది.

కృత్రిమ మేధ వల్ల పరిశ్రమలు మరింత చురుకుగా స్పందిస్తూ వనరులను పొదుపుగా వాడుకుంటూ తమ ఉత్పత్తిని పెంచుకోవ డానికి అవకాశం ఏర్పడుతుంది.

ముఖ్యంగా వ్యవసాయరంగంలో కృత్రిమ మేధ సాంకేతికంగా వినియోగించడం వల్ల అద్భుతమైన ఫలితాలు సాధించవచ్చు.

వర్షాభావం, సరైన మద్దతు ధర లభించకపోవడం, ముడిసరుకులు, ఎరువ్ఞల ధరలు స్థిరంగా ఉండకపోవడం వంటి అనేక అనిశ్చితి పరిస్థితులను అంచనా వేసి సరైన పరిష్కార మార్గం చూపగల శక్తి కృత్రిమ మేధకు మాత్రమే ఉంది.

ఇప్పటికే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ‘ఇ-పంట వంటి యాప్‌ల ద్వారా రైతుల నుండి సమాచారం సేకరించి వారి పంటకు బీమా సౌకర్యం, గిట్టుబాటు ధర, అవసరమైన సాంకేతిక సహకారం అందించడానికి ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఈ ప్రయత్నాలు ఫలవంతమైతే వ్యవసాయం మనదేశంలో పండగగా మారుతుంది.

అంతేకాకుండా మనదేశంలో తలపెట్టిన స్మార్ట్‌నగరాల్లో కృత్రిమమేధను వినియోగించుకోవడం వల్ల 1.5 సెకన్ల ముందే ప్రమాదాలను పసిగట్టే వ్యవస్థ ఏర్పాటు చేయవచ్చు.

దీనివల్ల 93 శాతం రోడ్డు ప్రమాదాలను అరికట్టవచ్చు. తాగి వాహనాలు నడిపే వారిని గుర్తించి, వారిని వాహనాలు నడపకుండా చేయడం వల్ల ఎక్కువ శాతం ప్రమాదాలను నివారించవచ్చు.

ప్రతి చిన్న సమస్యకు వైద్యులను ఆశ్రయించలేక ఎక్కువ మంది నేడు కృత్రిమ మేధతో పనిచేసే సాధనాలను ఆశ్రయిస్తున్నారు.

మానసిక వ్యాధులు, హృద్రోగాలు, కేన్సర్‌ వంటి అనేక జబ్బుల నిర్ధారణలో కృత్రిమ మేధ అనిర్వచనీయమైన పాత్రను పోషిస్తోంది.

కాబట్టి అన్ని రంగాల్లో కృత్రిమ మేధను జోడించడం వల్ల ప్రభుత్వాలు ఆర్థిక ప్రయోజనాలు పొందడమేకాక అంతర్జాతీయ నాయకత్వం వహించడానికి కూడా అవకాశం ఏర్పడుతుంది.

-ఈదర శ్రీనివాస్‌రెడ్డి

తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/