కాలహృదయస్పందనే ‘కాలంధర


2013లోపురావస్తు శాస్త్రవేత్తలు స్కాట్‌ల్యాండ్‌లోని అబెర్డీన్‌షైన్‌ ప్రాంతంలో పదివేల సంవత్సరాల క్రిందట తవ్వబడినట్టు భావిస్తున్న పన్నెండు గుంతలను కనుగొన్నారు. ఇవి చంద్రునికి కళతో సారూప్యత కలిగి ఉండటం విశేషం. వీటిని పరిశోధించిన శాస్త్రవేత్తలు అప్పుడే మనిషి కాలంధర (క్యాలండర్‌)ను ఉపయోగించాడని తేల్చారు. రోమన్‌ కాలంధర నుంచి జులియన్‌ కాలంధర, జులియన్‌ కాలంధర నుంచి ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న గ్రిగారియన్‌ కాలంధరలు రూపుదిద్దుకున్నాయని చరిత్ర చెబుతుంది.

universe
universe

వి శ్వం పుట్టక ముందు ఏమీ ఉండేది అనే ప్రశ్నకు స్టీఫెన్‌హాకింగ్‌ సమాధానం చెబుతూ ‘బిగ్‌ బ్యాంగ్‌తో విశ్వం పుట్టినప్పుడే కాలం పుట్టింది. అందుకని విశ్వం ఏర్పడక ముందు అనే వాక్యానికి వ్యాఖ్యానమే లేదు అని అర్థం వచ్చేలా తెలియచేశారు. దీన్నిబట్టి విశ్వానికి ‘ఆత్మ కాలం అని అర్థం చేసు కోవచ్చు. కాలం హృదయ స్పందనే కేలండర్‌ అని భావించవచ్చు. మనిషి తాను బుద్ధిజీవిగా మారిన నాటినుంచి తనకి సంబంధించి, ప్రకృతికి సంబంధించి, విశ్వాసానికి సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానాన్ని అన్వేషిస్తున్నాడు. ఆ క్రమంలోనే ‘శాస్త్రాలు ఊపిరి పోసుకున్నాయి. ఏ రాశినైనా అధ్యయనం చేయాలంటే ఆ రాశిని సంఖ్యల్లో చెప్పగలగాలి. సంఖ్యలలో చెప్పలేనివాటిని అధ్యయనం చేయలేమని కెల్విన్‌ అనే శాస్త్రవేత్త చెప్పారు. దూరాన్ని, ఉష్ణోగ్రత ను, కాంతిని, ధ్వనిని సంఖ్యలలో చెప్పగలుగుతున్నాం. కాబట్టి వాటి మీద ప్రయోగాలు చేయగలుగుతున్నాం.కాని రుచిని, వాస నను సంఖ్యల్లో చెప్పలేకపోతున్నాం.కాబట్టి ఆ అంశాల్లో పరిశోధన లకు అంతగా అవకాశం ఉండటం లేదు. ప్రకృతిని,ఆకాశాన్ని పరి శీలించిన మనిషి పొద్దుపొడవడం, పొద్దుగూకడం, చీకటి పడటం, తెల్లారడం, వెలుగు రావడం, వర్షాలు పడటం వంటి విషయాల ను గమనించాడు. ఆయా సంఘటనలు జరగడానికి మధ్య ఉండే వ్యవధిని గమనించి ఆ రాశికి ‘కాలం అని నామకరణం చేశారు. ఆపై కాలాన్ని కొలవడం అంటే సంఖ్యల్లో వ్యక్తీకరించడం ప్రారం భించాడు. 2013లోపురావస్తు శాస్త్రవేత్తలు స్కాట్‌ల్యాండ్‌లోని అబెర్డీన్‌షైన్‌ ప్రాంతంలో పదివేల సంవత్సరాల క్రిందట తవ్వబడి నట్టు భావిస్తున్న పన్నెండు గుంతలను కనుగొన్నారు. ఇవి చంద్రు నికి కళతో సారూప్యత కలిగి ఉండటం విశేషం. వీటిని పరిశోధిం చిన శాస్త్రవేత్తలు అప్పుడే మనిషి కాలంధర (క్యాలండర్‌)ను ఉప యోగించాడని తేల్చారు.రోమన్‌ కాలంధర నుంచి జులియన్‌ కాలం ధర,జులియన్‌ కాలంధర నుంచి ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న గ్రిగారియన్‌ కాలంధరలు రూపుదిద్దుకున్నాయనిచరిత్ర చెబుతుంది.
సంవత్సరానికి 10 నెలలు,మొదటి నెల మార్చి క్రీ.పూ ఎనిమిదవ శతాబ్దంలో రోమన్‌ మొదటి రాజు ‘రోము లస్‌ రోమన్‌ కాలంధరను అమల్లోకి తీసుకొచ్చారు. ఈ కాలంధర లో 10 నెలలు ఉండేవి. మొదటి నెలకు రోమీయుల యుద్ధ దేవ్ఞడైన మార్స్‌ (అంగారకుడు) పేరున మార్టియస్‌ అని నామ కరణం చేశారు. అదే ఇప్పటి మార్చి. వారి సౌందర్యదేవతగా భావించే శుక్రగ్రహంకు గ్రీకుపదమైన ఏప్రిలిస్‌ ఇప్పుడు ఏప్రిల్‌. రెండవ నెలకు,అట్లాస్‌ కుమార్తె అయిన మేయస్‌ నేటి ‘ మే పేరునుమూడవ నెలకు, రోమీయులు అందరి దేవ్ఞళ్ల రాజుగా భావించే బృహస్పతి భార్య పేరు జూనో ఇప్పటి ‘జూన్‌నాలుగో నెల కాగా మిగిలిన నెలలకు లాటిన్‌ పదాలైన క్వింటలిస్‌ అంటే ఐదవనెల అని అర్థం.సెక్సిలిస్‌ ఆరవనెల, సెప్టెంబర్‌ ఏడవనెల, నవంబర్‌ తొమ్మిదోనెల,డిసెంబర్‌ పదవ నెల అని పేరు పెట్టారు. ఈ కాలంధర సంవత్సరానికి 304 రోజులు. నుమపొంపిలస్‌ ఈ 304 రోజుల్లో సూర్యునికి చుట్టూ భూమి పరిభ్రమణం పూర్తి కావట్లేదనే విషయాన్ని గ్రహించి ఈ కాలంధరకు అదనంగా రెండు ముఖాలు కలిగివ్ఞండే దేవ్ఞడు లానురస్‌ ఇప్పటి జనవరి పేరుతో ఒకనెలను, శుద్ధీకరణ అని అర్థం గల ఫెబ్రరిస్‌ పేరుతో మరో నెలను చేర్చి 12 నెలల కాలంధరను వాడుకలోకి తీసుకొచ్చారు. ఈ కాలంధర సంవత్సరానికి 354 లేక 355 రోజులుండేవి. కొన్నిసార్లు ఫిబ్రరిస్‌ నెలలో ఒకరోజు ఎక్కువగా వచ్చేది. అంటే లీపు రోజు అన్నమాట. ఈ కొత్త కాలంధరను రోమన్‌ రిపబ్లికన్‌ కాలంధర అని పిలిచారు.ఈ కాలంధరలో లామరస్‌, ఫిబ్రరిస్‌ నెల లను మొదటి రెండు నెలలుగా అమర్చడం కారణంగా ఏడవ అనే అర్థాన్ని కలిగిన సెప్టెంబర్‌ నెల తొమ్మిదవ నెలగా, ఎనిమిది అని అర్థం కలిగిన అక్టోబర్‌ నెల పదవ నెలగా, తొమ్మిదవ అనే అర్థ్థాన్ని కలిగిన నవంబర్‌ నెల పదకొండవ నెలగా, పదవ అనే అర్థా న్ని కలిగిన డిసెంబర్‌ నెలను పన్నెండవ నెలగా పిలవవలసి వచ్చింది. క్రీ.పూ 45 సంవత్సరం వరకు ఈ కాలంధర వాడుక లో ఉంది. ఇందులోని లోపాల్ని సరిచేయడానికి జులియస్‌ సీజర్‌ అనే పేరుతో మరో కాలంధరను అమల్లోకి తీసుకొని వచ్చారు ఈ కాలంధర నాలుగు సంవత్సరాల కొకసారి 366 రోజులను, మిగి లిన 365రోజులను కలిగి ఉండేది.అంటే సగటున సంవత్సరానికి 365.25 రోజులు. అప్పటి వరకు క్వింటలీస్‌గా పిలవబడిన ఏడవ నెలకు జులియస్‌సీజర్‌ తన పేరున జులై షని నామకరణం చేశారు. తరువాత అధికారంలోకి వచ్చిన ఆగస్టన్‌ అప్పటివరకు సెక్ట్సిలిస్‌గా పిలవబడుతున్న ఎనిమిదవనెలకు తన పేరును ఆగస్టు అని నామకరణం చేసి జులై నెలకు సమానంగా 31 రోజులు వ్ఞండేలా చేశారు. ఆ విధంగా ఇప్పుడు మనం పిలుస్తున్న పన్నెండు నెలలు ఏర్పడ్డాయి. క్రీ.శ. 1582 అక్టోబరు 4వ తేదీ వరకు ఈ కాలంధర అమల్లో ఉంది.
2000 సంవత్సర లీపు సంవత్సరమే జులియన్‌ కాలంధర ప్రకారం సంవత్సరానికి 365.25 రోజులు. కాని భూమి సూర్యుని చుట్టూ పరిభ్రమించడానికి 365.2422 రోజుల సమయం పడుతుందని తెలుసుకోవడంలో జులియస్‌ కాలంధరలో సంస్కరణలు చేస్తూ పోప్‌గ్రిగారి ్లౖౖౖ కొత్త కేలండర్‌ను గ్రిగారియన్‌ కేలండర్‌ పేరుతో క్రీ.శ. 1582 అక్టోబర్‌ 15న అమల్లోకి తీసుకొచ్చారు.అప్పటి నుంచి ప్రతి నాలుగు సంవ త్సరాలకు లీపు సంవత్సరం కాకుండా అప్పుడప్పుడు 8 సంవత్స రం వస్తుంది.అందుకనే 1700,1800,1900 సంవత్సరాలు లీపు సంవత్సరాలు కావని కాని 2000 సంవత్సరం మాత్రం లీపు సంవత్సరం. అలా ఎలా జరుగుతుందో అర్థం చేసుకోవడానికి 400 సంవత్సరాలకి 146096.88 రోజులు. సవరిస్తే 146097 రోజులు.ఒకో సంవత్సరానికి 365 రోజులు చొప్పున400.365= 14600 రోజులను తీసివేస్తే ఇంకా 97 రోజులు మిగులుతున్నా యి. కాని ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి లీపు సంవత్స రం రావాలంటే 100 అదనపు రోజులు కావాలి. అంటే మూడు రోజులు తక్కువ అవ్ఞతున్నాయి.అందుకు 100యొక్క గుణిజా లను ఉదాహరణకు 1700 మినహాయించారు. 100యొక్క గుణి జాలను ఉదాహరణకు 1900ను మినహాయించారు. 100యొక్క గుణిజాలు నాలుగు వ్ఞండటం వలన 100 నుంచి నాలుగు తీసే స్తే 96వస్తుంది.అంటే 25రోజు మిగిలిపోతుంది.ఆ రోజును 400 యొక్క గుణిజం ఉదాహరణకు 2000, 2400కు వచ్చి 400 యొక్క గుణిజాలను లీపు సంవత్సరాలుగా చేశారు. అందుకని ఒక సంవత్సరం100యొక్క గుణిజం అయి400యొక్క గుణిజం, 100 యొక్క గుణిజం అయ్యి 400 యొక్క గుణిజాలు కాకపోయినా ఉదాహరణ 1900. అది లీపు సంవత్సరం కాదు. జులియన్‌ కాలంధర గ్రిగారియన్‌ కాలంధరగా మారిన క్రమంలో కొన్ని అపశృతులు అనివార్యం అయ్యాయి.జులియన్‌ కాలంధర 1582 సంవత్సరానికి 355 రోజులను కలిగి వ్ఞంటే గ్రిగారియన్‌ కాలంధర 365 రోజులను కలిగి ఉండటం చేత 10 రోజులను తొలగించవలసి వచ్చింది. ఆ కారణంగా క్రీ.శ 1582 సంవత్సరం లో అక్టోబర్‌ నాలుగు తర్వాత రోజు అక్టోబర్‌ 15 అయింది.
కాలంధర తేదీలకు వారం గణన శీఘ్ర గణన విన్యాసాల్లో కాలంధర తేదీలకు వారాల గణన ముఖ్యమైనది.అంటే ఒక తేదీని ఇచ్చినప్పుడు ఆ రోజు ఏ వారం అవ్ఞతుందో మనసులోనే గణించి చెప్పడం.ఈ విన్యాసాన్ని ప్రద ర్శించడంలో మానవ కంప్యూటర్‌గా పేరుగాంచిన శకుంతలాదేవిని అందెవేసిన చేయి. శీఘ్రగణన పోటీల్లో వారం గణన ఒక అంశం. ఈ గణనకు చాలా పద్ధతులు అందుబాటులో ఉన్నాయి. నేను తయారు చేసుకున్న ‘జఅఅసూత్రాన్ని ఇక్కడ అందిస్తున్నాను. ఈ సూత్రాన్ని ఉపయోగించి ఒక తేదీకి మరోవారం తెలుసుకోవడానికి మూడు సంఖ్యల మొత్తాన్ని 7చేత భాగిస్తే వచ్చే శేషాన్ని కనుగొన గలిగితే చాలు. ఈ మూడు సంఖ్యలు ఏమిటంటే సంవత్సరంలో ని చివరి రెండు అంకెల సంఖ్య ఉదాహరణకు 2069కి 69, ఈ రెండంకెల సంఖ్యను 4చేత భాగిస్తే వచ్చే భాగఫలం 17 మరియు అదే తేది.ఉదాహరణకు 2093 సంవత్సరం డిసెంబర్‌ 22 తేదీని తీసుకుంటే 93+23+22=138.ఈ 138ని 7చేత భాగిస్తే శేషం 5. ఇలా శేషాన్ని కనుగొన్న తర్వాత ఆ సూత్రంలోని ‘జసెడిశు అనే పదంలోని భావాన్ని అనుసరించి ‘జ అనగాజనరి ‘సె అనగా సెప్టెంబర్‌,’డి అనగా డిసెంబర్‌ ‘శు అనగా శుక్రవారం అని అర్థం చేసుకొని జనవరి, సెప్టెంబర్‌, డిసెంబర్‌ నెలల్లో ఏ నెలవచ్చినా శుక్రవారంతో లెక్కించడం ప్రారంభించాలి. శుక్రవారంతో లెక్కించ డం ప్రారంభిస్తే శేషం5కాబట్టి ఐదురోజులు లెక్కించాలి. అప్పుడు మంగళవారం వస్తుంది. కాబట్టి 2093 సంవత్సరం డిసెంబర్‌ 22 తేదీ మంగళవారం అవ్ఞతుంది. అవి ‘జఅఅ సూత్రంలో 7 పదాలు మాత్రమే వ్ఞంటాయి. అవి ఏమిటంటే ‘జఅఅ, ‘మేసో, ‘అమం, ఫిమానబు, ‘జుగూ, ‘సెడిశు, జుఏశ కాకపోతే లీపు సంవత్సరం జనవరి, ఫిబ్రవరినెలల్లో వచ్చినప్పుడు మాత్రం మర్చి పోకుండా ఒకవారాన్ని తగ్గించాలి.అంటే బుధవారానికి మంగళవా రం,శుక్రవారానికి గురువారం.ఈ సూత్రాన్ని ఉపయోగించి 2000 నుంచి 2099 వరకు ఏ తేదీకైనా వారాన్ని తెలుసుకోవచ్చు. ఒక వేళ 1900 నుంచి 1999 వరకు ఏ సంవత్సరంవచ్చినా చివరిలో ఒక రోజును ఎక్కువచేసి చెప్పితే సరిపోతుంది. అంటే బుధవారా నికి గురువారంఅని, శనివారానికి ఆదివారం.ఉదాహరణకు 1993 సంవత్సరం జూన్‌20వ తేదీ ఏవారమో తెలుసుకుందాం.1993ని 93ని 4చేత భాగిస్తే వచ్చేభాగఫలం23ని తేదీ20ని కలిపితే 136 వస్తుంది.ఈ 136ని 7చేత భాగిస్తే శేషం3.ఆ సూత్రంలోని’జూగు అనే పదాన్ని అనుసరించి గురువారంతో లెక్కించడం ప్రారంభించి శేషం3కాబట్టి 3రోజులను లెక్కిస్తే శనివారం వస్తుంది.కాని ఇచ్చిన సంవత్సరం 1900-1999 మధ్యకాలంలోనిది కాబట్టి ఒకరోజును పెంచితే ఆదివారం అవ్ఞతుంది.కాబట్టి 20-6-1993 తేదీ ఆదివా రం కొన్నిసార్లుశేషం ‘0రావచ్చు.అప్పుడు శేషాన్ని7గా భావించాలి. ఇలా ‘కాలంధర గురించి ఎన్ని విశేషాలనైనా చెప్పుకోవచ్చు.

  • డాక్టర్‌ చింతపల్లి డేవిడ్‌రాజు

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/