ఆరోగ్యానికి మంచి నేస్తం

సి-విటమిన్ తో బోలెడు ఉపయోగాలు

Health and beauty with Vitamin-C
Health and beauty with Vitamin-C

విటమిన్ -సి మన ఆరోగ్యానికి మంచి దోస్తీ .చర్మానికి సి-విటమిన్ అవసరం చాలా ఉంటుంది.. చర్మ ఆరోగ్యమే కాకుండా సౌందర్యానికి ఇది చాలా అవసరం.. ఇంతకీ సి-విటమిన్ ఎందులో ఎక్కువ దొరుకుతుంది? సి- విటమిన్ వుండే ఆహార పదార్ధాలను సరైన మోతాదులో తీసుకుంటే సరి. నారింజ, నిమ్మ, బెర్రీస్ తింటే చర్మానికి మంచిదియు.. సి-విటమిన్ శరీరం ఉత్పత్తి చేయలేదు.. కచ్చితంగా మనం దాన్ని ఆహారం నుంచే తీసుకోవాలి..

సి-విటమిన్ వలన ఇమ్మ్యూనిటి పెరుగుతుంది.. రక్తపోటు రాకుండా అదుపుదల చేస్తుంది… గుండె వ్యాధుల సమస్య ఉండదు.. సూర్యుని నుంచి వచ్చే అతినీల లోహిత కిరణాల వాళ్ళ కణాలు పాడైపోకుండా ఉండటానికి విటమిన్ -సి అవసరం ఉంటుంది.. అలాగని సన్ స్క్రీన్ లా పనిచేయదు.. చర్మం మీద ఉండే నల్ల మచ్చలు, పొడల్లాంటి హైపర్ ఫిట్ మెంటేషన్ సమస్య ఉండదు.. చర్మం మెత్తగా మెరుపు వచ్చేందుకు ఇది ఉపయోగ పడుతుంది..

సాధారణంగా యాంటీ ఏజింగ్ క్రీముల్లో విటమిన్ -సి ఓ పవర్ ఫుల్ ఇంగ్రిడిఎంట్ .. ఊరికే క్రీములు ముఖానికి రుద్దుకోవటం వలన ఉపయోగం లేదు… ఖచ్చితంగా నాణ్యమైన డైట్ పాటించాలి.. అప్పుడే మంచి ఫలితాలు వస్తాయి… విటమిన్ -సి వలన కొల్లాజిన్ ఉత్పత్తి అయి చర్మానికి తగిలిన గాయాలు త్వరగా మానిపోతాయి.. ఇక స్కిన్ టోన్ కు తిరుగు ఉండదు.. సిట్రస్ వుండే పండ్లు నిమ్మ, నారింజ, బెర్రీ లోనే విటమిన్ – సి ఉంటుంది.. వీటితో పాటు కొత్తిమీర, రెడ్ పెప్పర్, బ్రొకోలీ వంటి వాటిలో సి-విటమిన్ అధిక శాతం ఉంటుంది..

‘చెలి’ (మహిళల ప్రత్యేకం) వ్యాసాల కోసం : https://www.vaartha.com/specials/women/