కరోనా నుంచి రక్షించుకుందాం

స్వయం పరిశుభ్రత .. మరో మార్గం లేదు

Beware of Carona virus
Beware of Carona virus

ఎవరినోట విన్నా కరోనా.. కరోనా ఇదే మాట. గత రెండునెలలుగా కరోనా ప్రపంచదేశాల్ని వణికిస్తోన్న మహామ్మారి వైరస్‌.

ఈ వైరస్‌ నివారణకు ఇప్పటివరకు మెడిసిన్‌ లేదు. ఆ ప్రయోగంలో వైద్యనిపుణులు యుద్ధప్రాతిపదికంగా పరిశోధనల్ని చేస్తున్నారు.

ఫలితం ఎప్పటికి వస్తుందో వేచిచూడాల్సిందే. దీంతో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆయాదేశాలు విద్యాసంస్థల్ని, షాపింగ్‌మాల్‌, సినిమాథియేటర్లను, ఫంక్షన్‌హాల్స్‌లను మూసివేయాలని ఆజ్ఞల్ని జారిచేశారు.

ఎవరికివారే స్వయం పరిశుభ్రతను పాటించడం తప్ప మరో మార్గం లేదు. వ్యక్తిగతపరిశుభ్రతతోపాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి.

మానవుని ఆరోగ్యానికి సంబంధించి ఆయుర్వేదం వివరించిన అనేక అంశాల్లో ‘బుతుచర్య ఒకటి. వివిధ బుతువుల్లో చూపే సూర్యుడి ప్రభావం వల్లనే మానవుని బలం, వ్యాధి క్షామత్వక శక్తి మారుతుంటుంది. శిశిర, వసంత, గ్రీష్మ బుతువుల్ని (సుమారుగా జనవరి 15 నుంచి జులై 15 వరకు) ఆయుర్వేదం ‘ఆదానకాలంగా వర్ణించింది.

అదే ఉత్తరాయణకాలం. ఈ కాలంలో సూర్యుడు భూమి మీద నుంచి, ప్రకృతిలో నుంచి శక్తిని గ్రహిస్తాడు. కనుక మనిషి నీరసపడతాడు.

వర్ష, శరత్‌, హేమంత బుతువులు దక్షిణాయనకాలం. ఇది విసర్గకాలం. సూర్యుడు తన శక్తిని ప్రసాదిస్తాడు. చంద్రుని ఆధిపత్యం వల్ల మనిషిలో శక్తివృద్ధి చెందుతుంది. ఒక బుతువ్ఞ మారి ఇంకొక బుతువు ప్రవేశించే మధ్యకాలాన్ని ‘బుతుసంధి అంటారు.

ఇటువంటి వాతావరణపు మార్పును తట్టుకునేందుకు ఆయుద్వేదం కొన్ని జాగ్రత్తలు సూచించింది. ప్రస్తుతం శిశిర వసంతాల మధ్యనున్న బుతుసంధి. ఇది కఫ ప్రకోపకాలం.
బుతుచర్య: లఘు, రూక్షాహారం సేవించాలి.

అంటే తేలికగా జీర్ణమై, శరీరాన్ని తేలికపరచే ఆహారం. వంకాయ, దొండ, కాకర, బీర మొదలైన శాకాహారం, ఆకు కూరల్ని ఉడికించి వండుకుని వేడివేడిగా భుజించాలి.

నూనెలు, నెయ్యి వంటి స్నిగ్ధ పదార్థాలు, పాయసాల వంటి బరువైన ఆహారం విడిచిపెట్టి, సెనగలు, బఠాణీల వంటి శాకాలను వండుకుతినాలి. తీపి, పులుపు తగ్గించి, కారంగా ఉన్న ఊరగాయలు తింటే మంచిది. శరీరానికి నలుగుపెట్టుకుని స్నానం (ఉద్వర్తనం), వ్యాయామాలు మంచిది. స్నానానంతరం ‘కుంకుమ పువ్వు, కర్పూర చందనం వంటి సుగంధద్రవ్యాలు శరీరానికి మంచివి.

ఇవి క్రిమిహరంగా ఉపకరిస్తాయి. అల్లం లేక శొంఠి (శృంగవేర) వేసి మరిగించిన నీటిని తాగాలి. స్వచ్ఛమైన తేనె వాడుకోవాలి.

(వాగ్భాటాచార్యుని శ్లోకంలో, తీక్ష, లఘు, రూక్షభోజనైః వ్యాయామ ఉద్తర్తన, శృంగవూనాంబే వంటి పదాలు కనిపిస్తాయి) ప్రాచీన ఆయుర్వేదవైద్య ఆచార్యులు వైరస్‌, బ్యాక్టీరియా వంటి సూక్ష్మక్రిములను వివరిస్తూ క్రిమి/కృమిశబ్దంతో పాటు గ్రహ, భూత, పిశాచ, రాక్షస పదాలనుకూడా ఉపయోగించారు.

బుతుసంధి సమయాలలో వీటి ప్రాబల్యం అధికమౌతుంది. ఇవి హాని చేసే స్రోతస్సుల (సిస్టమ్స్‌)ను బట్టి కలిగే లక్షణాలను వివరించారు.

ప్రాణావహస్త్రోతస్సు (ముక్కు నుంచి ఊపిరితిత్తుల వరకు)నకు సంబంధించి, తుమ్ములు, జలుబు, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం, జ్వరం వంటి లక్షణాలను వర్ణించారు. కొన్నిరకాల సూక్ష్మాంగ జీవులు వాయు కాలుష్యం ద్వారా సంక్రమించి ప్రజా వినాశనానికి (ఎండెమిక్స్‌/ఎపిడెమిక్స్‌) దారి తీస్తాయని చెప్పారు.

అటువంటి క్రిములకు మనం పెట్టేపేరు ఏదైనా లక్షణాలను బట్టి చికిత్స వర్ణించారు. పరిశుభ్రత, వ్యాధి క్షమత్వక శక్తిని పెంపొందించుకోవటం నివారణా సూత్రాలలో ప్రాధాన్యత వహిస్తాయి. ప్రస్తుతపు కరోనా వ్యాధికి సంబంధించి నివారణ, చికిత్సల గురించి చూద్దాం.

నివారణ: ఆహారం:

పైన చెప్పినట్లు తేలికపాటి ఆహారం, వేడివేడిగా ఉండే తాజా శాకాహారం మంచిది.బయట పదార్థాలు, ముఖ్యంగా జంక్‌, ఫాస్ట్‌ ఫుడ్స్‌, పానీయాఉల, ఐస్‌క్రీములు విడిచిపెట్టాలి.

విహారం:

తేలికపాటి వ్యాయామం. ఇంటబయట పరిశుభ్రత ముఖ్యం. సాంబ్రాణి ధూపాన్ని ప్రతినిత్యం రెండుసార్లు ప్రయోగించి ఇంటిని, దుస్తుల్ని పరిశుభ్రం చేసుకోవాలి. ముక్కుకు గుడ్డను అడ్డు పెట్టుకోవటం, వ్యాధిగ్రస్తులకు దూరంగా ఉండటం మంచిది. వేపకొమ్మలు, మామిడి ఆకుల తోరణాలు ఇంట్లో ఉంటే అవి సూక్ష్మక్రిముల్ని పీల్చేసుకుంటాయన్నది పరిశోధనా ఫలితాలలో ఒకటి.

ఔషధాలు:

లశునాది కషాయం: 30మి.లీ. రెండు పూటలా తాగాలి.

తయారీవిధానం:

ఐదుగ్రాముల అల్లం ముక్క, ఐదారు వెల్లుల్లి రెబ్బలు కొద్దిగా దంచి పావు లీటరు నీళ్లలో మరిగించాలి. మరుగుతున్నప్పుడు రెండు చిటికెల పసుపు, ఆరు చిటికెలు దాల్చిన చెక్క చూర్ణం దాంట్లో వేసి, మూడువంతులు ఇరగగొట్టాలి. మిగిలినదాన్ని వడవట్టి రెండు భాగాలుగా ఉదయం, సాయంత్రం తాగాలి. ఎంతకాలం తాగినా పరవాలేదు.

ఉసిరికాయ:

దేశీఉసిరి (ఆమలకి) మంచిది. ఒక కాయతినటం మంచిది లేదా 5.మి.లీ. (ఒకచెంచా) రసం తేనెతో సేవించాలి లేదా ఎండబెట్టి తయారుచేసిన పొడి (ఆమలకీచూర్ణం) 3 గ్రా.లు తేనెతో రోజూ ఒకసారి సేవించాలి. వ్యోషాదివటి లేదా కంఠసుధారస మాత్రలు (ఆయుర్వేద షాపులలో దొరుకుతాయి): ఒక్కొక్క మాత్రను చప్పరిస్తూ తినాలి. రోజులో ఐదారువరకు తినవచ్చు.

చికిత్స:

1. త్రిభువన కీర్తి రస మాత్రలు: ఉదయం ఒక మాత్ర 2. మమాలక్ష్మీవిలాసరసమాత్రలు: రాత్రి ఒక మాత్ర మూడువారాల వరకు వాడుకోవచ్చు. వైద్యుని పర్యవేక్షణ ముఖ్యం. నివారణకు చెప్పినవి కూడా చికిత్సకు ఉపకరిస్తాయి. మహాలక్ష్మీవిలాసరస మాత్రలు నివారణకు కూడా వాడుకోవచ్చు. ఊపిరితిత్తుల క్షమత్వం పెరుగుతుంది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/