ఎవరూ ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదుః వైఎస్‌ఆర్‌సిపి ఎమ్మెల్యే

రేపు ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో తెలియదు.. మేమేమైనా ఈ పార్టీలో శాశ్వతమా? ఎమ్మెల్యే చంటిబాబు

ysrcp-mla-chanti babu-sensation-comments-on-party-change

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. రేపు ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎవరికి తెలుసంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. తాను వైఎస్‌ఆర్‌సిపిలో శాశ్వతమా? అని వ్యాఖ్యానించారు. ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికి తెలుసని అన్నారు. ‘పార్టీలు, గాడిద గుడ్డు ఈరోజు ఉంటాయి. రేపు పోతాయి. ఏం… మేమైనా శాశ్వతమా ఈ పార్టీలో. చెప్పండి.. ఎవరు ఏ పార్టీలో శాశ్వతంగా ఉన్నారో చెప్పండి. రేపన్నరోజు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఎవరికి తెలుసు?’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఏ ఒక్కరూ ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదని ఆయన అన్నారు. ఎన్నికల్లో పోటీ చేసే క్రమంలో ఒక నాయకుడు అనేవాడు వేరే పార్టీలోకి మారడం సహజమని చెప్పారు. పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/