భీమ్లా నాయక్ డైరెక్టర్ తో బెల్లం కొండ శ్రీనివాస్

బెల్లం కొండ శ్రీనివాస్ నూతన చిత్రం ప్రారంభమైంది. భీమ్లా నాయక్ ఫేమ్ సాగర్ చంద్ర డైరెక్షన్లో నటిస్తున్నాడు. దీనికి సంబదించిన పూజా కార్యక్రమాలు గురువారం జరిగాయి. అల్లుడు శ్రీను తో ఇండస్ట్రీ కి హీరోగా పరిచమైన శ్రీను..మొదటి సినిమాతోనే కమర్షియల్ హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత చేసిన సినిమాలేవీ పెద్దగా సక్సెస్ కాలేదు. రీసెంట్ గా ఛత్రపతి చిత్రాన్ని హిందీ లో రీమేక్ చేసి ఘోర పరాజయాన్ని అందుకున్నాడు.

ప్రస్తుతం ఓ హిట్ కొట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ 10వ చిత్రంగా రాబోతున్న ఈ చిత్రానికి సాగర్ డైరెక్ట్ చేస్తుండగా, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో రామ్ ఆచంట గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. భీమ్స్ ఈ చిత్రానికి సంగీతాన్ని ఇస్తున్నాడు. ఇక ఈ మూవీకి సంబంధించిన రెగ్యూలర్ షూటింగ్ను జూన్ రెండో వారం నుంచి మొదలు పెట్టబోతున్నట్లు కూడా చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది.