రాజకీయంగా ఎదుర్కోలేకే బాబు, లోకేశ్ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు

అడాన్ కంపెనీతో తమ కుంటుబానికి సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారన్న విజయసాయి రెడ్డి

vijayasaireddy

అమరావతిః వైఎస్‌ఆర్‌సిపి ఎంపీ విజయసాయిరెడ్డి టిడిపి అధినేత చంద్రబాబు, ఆయ‌న కుమారుడు లోకేష్ త‌న‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నార‌ని మండిపడ్డారు. అడాన్ కంపెనీతో తమ కుటుంబానికి సంబంధాలు ఉన్నాయని తప్పుడు ప్రచారం చేస్తున్నారని చెప్పారు. తగిన ఆధారాల‌తో ఈ దుష్ఫ్రచారాన్నితిప్పికొట్టే సామ‌ర్థ్యం త‌న‌కు ఉంద‌న్నారు. ఇప్పటిదాకా నారా, నంద‌మూరి కుటుంబాల గురించి తాను వ్యక్తి గతంగా మాట్లాడలేదన్న ఆయన పరిధి దాటొద్దని చంద్రబాబు, లోకేష్ ను హెచ్చరించారు. అస‌భ్య పదజాలన్ని వాడాలంటే వారిద్దరికంటే తాను పదింతలు ఎక్కువ ఉపయోగించాల్సి ఉందన్నారు.

అడాన్‌ కంపెనీపై చంద్రబాబు, టీడీపీ దుష్ర్పచారం చేస్తోందన్నారు. తమ కుటుంబానికి అడాన్‌ కంపెనీతో సంబంధాలు ఉన్నాయని ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ‘చంద్రబాబుకు చెందిన ఇతర కంపెనీల్లో అవినీతి జరిగింది. హెరిటేజ్‌ ఫుడ్స్‌లో వడ్లమూడి నాగరాజు డైరెక్టర్‌గా ఉన్నారు. చంద్రబాబు కుటుంబానికి కూడా ఆ కంపెనీలతో సంబంధం ఉన్నట్టేనా?. కార్పొరేట్‌ రంగంలో చంద్రబాబుకు ఉన్న చర్రిత మరెవరికీ లేదు. వరసకు చంద్రబాబు నాకు అన్న అవుతారు. నా భార్య బంధువును తారకరత్న పెళ్లి చేసుకున్నారు. అలా అయితే చంద్రబాబు ఆస్తులన్నీ నావే అవుతాయా?’ అని విజయసాయి ప్రశ్నించారు. ఏదో ఒక రకంగా తనపై బురద జల్లేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని, ఇలాంటి మానుకోవాల‌ని విజ‌య‌సాయిరెడ్డి హెచ్చరించారు. ఈరోజు ఉదయం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతుపై వ్యాఖలు చేశారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/