రష్మిక తో డేటింగ్ ఫై బెల్లంకొండ శ్రీనివాస్ క్లారిటీ

గీత గోవిందం ఫేమ్ రష్మిక తో బెల్లం కొండ శ్రీనివాస్ డేటింగ్ లో ఉన్నారనే వార్తలపై శ్రీనివాస్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం శ్రీనివాస్ ఛత్రపతి రీమేక్ లో నటిస్తున్నాడు. వి వినాయక్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమంలో మాట్లాడుతూ..రష్మిక తో డేటింగ్ వార్తలపై స్పందించారు. సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని స్పష్టం చేశారు.

రష్మిక, తాను మంచి స్నేహితులం మాత్రమేనని అన్నారు. షూటింగ్ పనిపై ముంబైకి వెళ్లినప్పుడు విమానాశ్రయంలో కలుసుకుంటూ ఉంటామని, అలా అనుకోకుండా కలుసుకున్న సందర్భాలు తక్కువేనని పేర్కొన్నారు. అంతమాత్రానికే ఇలాంటి వార్తలు రాసేస్తారా? అని ప్రశ్నించారు. అవన్నీ పుకార్లేనని, వాటిని నమ్మవద్దని అన్నారు.