‘భయ్యూ దూజ్’ పండుగ రోజున ప్రమాణ స్వీకారం?

వెల్లడించిన పార్టీ వర్గాలు

nitish kumar

పాట్నా: బీహార్‌ సిఎంగా వరుసగా నాలుగో సారి జేడీ (యూ) అధినేత నితీశ్‌ కుమార్సోమవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలున్నాయని తెలుస్తోంది. బీహార్ వాసులు ఎంతో పవిత్రంగా జరుపుకునే ‘భయ్యూ దూజ్‌’గ పండుగ రోజున ఆయన సిఎంగా పదవిని మరోసారి చేపడతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. 2015 ఎన్నికల్లో 71 సీట్లను సాధించిన నితీశ్ కుమార్, ఈ దఫా 28 సీట్లను కోల్పోయారు. రాష్ట్రానికి మూడు సార్లు సిఎంగా పనిచేసిన నితీశ్ కు, ఈ ఎన్నికల్లో చిరాగ్ పాశ్వాన్ రూపంలో అవాంతరం ఎదురైంది. చిరాగ్ నిలిపిన అభ్యర్థులు, ఎన్డీయేలో భాగస్వామ్యమైన జేడీ (యూ) అభ్యర్థుల ఓట్లను చీల్చారు. ఇదే విషయాన్ని మనసులో పెట్టుకున్న నితీశ్, ఎల్జేపీని తక్షణం ఎన్డీయే నుంచి సాగనంపాలని కోరుతున్నారు.

ఇక, గతేడాది జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో శివసేనతో పొత్తు పెట్టుకుని పోటీ చేసిన బిజెపి, విజయం తరువాత, సిఎంగా తమ అభ్యర్థే ఉండాలని పట్టుబట్టడంతో శివసేన విడిపోయి, కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బిహార్ లో నితీశ్ ను కాదని తమ అభ్యర్థిని సిఎం చేయాలని బిజెపి ప్రయత్నిస్తే, మహారాష్ట్రలో నెలకొన్న పరిణామాలే ఏర్పడవచ్చని, తన పాత మిత్రుడు ఆర్జేడీతో నితీశ్ చేతులు కలపవచ్చని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/