అయ్యన్న పాత్రుడి అరెస్ట్.. ఏపీ వ్యాప్తంగా టిడిపి శ్రేణుల నిరసన

అయ్యన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్

tdp-protests-against-ayyanna-patrudu

అమరావతిః టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడిని ఏపీ సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసిన చేసిన విషయం తెలిసిందే. నర్సీపట్నంలోని ఆయన ఇంట్లో ఆయనతో పాటు ఆయన కుమారుడిని కూడా అరెస్ట్ చేసి తరలించారు. ఇంటిగోడ కూల్చివేతకు సంబంధించిన వ్యవహారంలో ఫోర్జరీ డాక్యుమెంట్లను సమర్పించారనే ఆరోపణలతో అరెస్ట్ చేశారు.

మరోవైపు అయ్యన్నను అరెస్ట్ చేయడంపై టిడిపి శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు దిగాయి. నిరసన ప్రదర్శనలు చేపట్టాయి. వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం కక్ష సాధింపులను పాల్పడుతోందని నినాదాలు చేస్తున్నారు. అయ్యన్నను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఆందోళనకు దిగిన టిడిపి నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. ఎక్కడికక్కడ వారిని అదుపులోకి తీసుకు అక్కడి నుంచి తరలిస్తున్నారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/