‘బెదురులంక 2012’ నుండి రొమాంటిక్ సాంగ్ రిలీజ్

RX 100 ఫేమ్ కార్తికేయ నటిస్తున్న తాజా చిత్రం ‘బెదురులంక 2012’. RX 100 తో ఇండస్ట్రీ కి హీరోగా పరిచమైన కార్తికేయ..మొదటి సినిమాతోనే యూత్ లో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత వరుస పెట్టి సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం క్లాక్స్ డైరెక్షన్లో ‘బెదురులంక 2012’ మూవీ చేస్తున్నాడు. రవీంద్ర బెనర్జీ నిర్మించిన ఈ సినిమాలో డీజే టిల్లు ఫేమ్ నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక చిత్ర ప్రమోషన్లో భాగంగా సినిమాలోని ‘వెన్నెల్లో ఆడపిల్లా .. కవ్వించే కన్నెపిల్లా .. కోపంగా చూస్తే ఎల్లా .. క్షణంలో అగ్గిపుల్లా’ అంటూ సాగే రొమాంటిక్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేసారు. మణిశర్మ స్వరపరిచిన ఈ పాటకి కిట్టూ విస్సాప్రగడ సాహిత్యాన్ని అందించగా .. హారిక నారాయణ్ – సుధాంశు ఆలపించారు.

YouTube video