బాలయ్య కు విలన్ గా బాహుబలి బ్యూటీ

అఖండ , వీర సింహ రెడ్డి చిత్రాలతో వరుస బ్లాక్ బస్టర్స్ హిట్స్ అందుకున్న నందమూరి బాలకృష్ణ ..ప్రస్తుతం సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమా చేయబోతున్నాడు. షైన్‌ స్క్రీన్‌ పతాకంపై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలకృష్ణ కు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌ మీదకు వెళ్లనుంది. ఈ సినిమాలో బాలయ్య తన వయసుకు తగ్గట్టుగా తండ్రి పాత్రలో కనిపిస్తారని , ధమాకా ఫేమ్ శ్రీలీల ఆయన కూతురు పాత్రను పోషించబోతున్నట్లు టాక్.

ఇదిలా ఉంటె తాజాగా ఓ వార్త ఇప్పుడు ఫిలిం సర్కిల్లో హాట్ హాట్ గా చక్కర్లు కొడుతుంది. ఈ చిత్రంలో విలన్ పాత్రకు ఎవ్వరూ ఊహించని విధంగా బాలీవుడ్ నటిని ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. ‘బాహుబలి’ సినిమాలో ‘మనోహరి’ పాటలో నటించి ఆకట్టుకున్న నోరా ఫతేహి ను అనిల్ రావిపూడి విలన్ గా చూపించబోతున్నారట. అనిల్ చెప్పిన కథకు నోరా అంగీకరించినట్టు తెలుస్తోంది. నోరా పాత్ర నెగటివ్ షేడ్స్ తో కూడి పవర్ ఫుల్ గా ఉంటుందట. దీనిపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు.