ఆలుగడ్డ పిండికూర

Ruchi_Potato pork

ఆలుగడ్డ కూరంటే ఇష్టపడని వారుం డరు. అందులో ఆలుగడ్డ కూరను చాలా రకాలుగా చేయవచ్చు. ఇది అన్నంలోకి, చపాతీలలోకి బాగుంటుంది. ఇక్కడొక వెరైటీ ఆలుగడ్డ కూరను ట్రై చేద్దామా మరి!

ఆలుగడ్డలు -250 గ్రాములు
సెనగపిండి – 3 టీ స్పూన్లు
ఉల్లిపాయలు – 2
పచ్చిమిర్చి – 2
కరివేపాకు – 2 రెబ్బలు
పసుపు – 1/4 టీ స్పూన్‌
కారంపొడి – 1 టీ స్పూన్‌
ధనియాల పొడి – 1 టీ స్పూన్‌
అల్లంవెల్లుల్లి ముద్ద – 1/2 టీ స్పూన్‌
కొత్తిమీర – కొద్దిగా
ఆవాలు, జీలకర్ర – 1/4 టీ స్పూన్‌
ఉప్పు – తగినంత
నూనె – 3 టీస్పూన్‌లు

తయారుచేసే విధానం

ఆలుగడ్డలు పసుసు వేసి ఉడికించుకోవాలి. చల్లారిన తరువాత పొట్టు తీసి పొడిపొడిగా మెదిపి ఉంచుకోవాలి. గిన్నె లేదా మందంగా ఉండే కడాయిలో నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, నిలువ్ఞనా చీల్చిన పచ్చిమిర్చి వేసి మెత్తబడేవరకు వేయించాలి. ఇందులో పసుపు, కరివేపాకు, కారంపొడి, అల్లంవెల్లుల్లి ముద్ద వేసి కొద్దిగా వేసి ఆలుగడ్డ, తగినంత ఉప్పు వేసి కలిపి మూత పెట్టాలి. కూర బాగా మగ్గిన తరువాత ధనియాలపొడి, సెనగపిండిని అరకప్పు నీళ్లలో ఉండలు లేకుండా కలిపి వేయాలి. వెంటనే కలుపుతూ ఉడికించాలి. చివరలో సన్నగా తరిగిన కొత్తిమీర వేసి దింపేయాలి.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/